పరమాశీర్వాదము కోరి
పరమాశీర్వాదము కోరి - పరలోక పిత అరుదెంచితిమి llపరమll
1. తండ్రీ యోగ్యతలేని మాకు - నేడే దయచేయుము నీ శక్తి
హృదయములను ఖాళీజేసి - పరలోక పితా అరుదెంచితిమి llపరమll
2. ఎన్నెన్నో పాపాలు జేసి - అపరాధమున సిగ్గునొంది మాదు
శిరములను వాల్చి - పరలోక పితా అరుదెంచితిమి llపరమll
3. బలవంతుడవు నీవే యేసు - ప్రభువా సర్వశక్తియు నీవే
నిన్నే సదా స్తుతియించెదము- పరలోక పితా అరుదెంచితిమి llపరమll
4. ఇలలో శ్రమలనోర్చిన ప్రేమ - అదే ప్రేమను కోరియున్నాము
నీ దాసులను మరువకుము - పరలోక పితా అరుదెంచితిమి llపరమll Paramaasheervaadamu kori - paraloka pita arudenchitimi llparamall 1. tandree yogyataleni maaku - nede dayacheyumu nee shakti Hrudayamulanu khaaleejesi - paraloka pitaa arudenchitimi llparamall 2. ennenno paapaalu jesi - aparaadhamuna siggunondi maadu Shiramulanu vaalchi - paraloka pitaa arudenchitimi llparamall 3. balavantudavu neeve yesu - prabhuvaa sarvashaktiyu neeve Ninne sadaa stutiyinchedamu- paraloka pitaa arudenchitimi llparamall 4. ilalo shramalanorchina prema - ade premanu koriyunnaamu Nee daasulanu maruvakumu - paraloka pitaa arudenchitimi llparamall
Comments
Post a Comment