నీ జీవితంలో - గమ్యంబు యేదో
నీ జీవితంలో - గమ్యంబు యేదో - ఒకసారి యోచించవా
ఈనాడే నీవు - ప్రభుయేసు కొరకు - నీ హృదయ మర్పింపవా
1. నీ తల్లి గర్భమున నీవుండినపుడే - నిన్ను చూచే ప్రభు కన్నులు (2)
యోచించినావా - ఏ రీతి నిన్ను - నిర్మించె తన చేతులు llనీ జీవితంలోll
2. నీలోన తాను నివసింపగోరి - దినమెల్ల చేజాచెను
హృదయంపు తలుపు - తెరవంగలేవా యేసు ప్రవేశింపను (2) llనీ జీవితంలోll
3. తన చేతులందు రుధిరంపు దారల్ - స్రవియించె నీ కోసమే
భరియించె శిక్ష నీ కోసమేగా - ఒకసారి గమనించవా llనీ జీవితంలోll
4. ప్రభు యేసు నిన్ను- సంధించునట్టి - సమయంబు ఈనాడెగా
ఈ చోట నుండి - ప్రభు యేసు లేక - పోబోకుమో సోదరా llనీ జీవితంలోll
nee jeevitanlo - gamyambu yedo - okasaari yochinchavaa
eenaade neevu - prabhuyesu koraku - nee hrudaya marpimpavaa
1. nee talli garbhamuna neevundinapude - ninnu chooche prabhu kannulu (2)
yochinchinaavaa - e reeti ninnu - nirminche tana chetulu llnee jeevitanloll
2. neelona taanu nivasimpagori - dinamella chejaachenu
hrudayampu talupu - teravangalevaa yesu praveshimpanu (2) llnee jeevitanloll
3. tana chetulandu rudhirampu daaral - sraviyinche nee kosame
bhariyinche shiksha nee kosamegaa - okasaari gamaninchavaa llnee jeevitanloll
4. prabhu yesu ninnu- sandhinchunatti - samayambu eenaadegaa
ee chota nundi - prabhu yesu leka - pobokumo sodaraa llnee jeevitanloll
Comments
Post a Comment