మహిమ మహిమ - ప్రభుకే మహిమ - మాకెన్నడు
మహిమ మహిమ - ప్రభుకే మహిమ - మాకెన్నడు
వలదు సుమా ఇహలోకమందు పరలోకమందు - ప్రభు యేసునకే మహిమ
అ.ప అ ... ఆనందమే పరమానందమే - అది మాకు
ఆశీర్వాదమే ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను -
అంత దీనులమై యుందుము.
1. కొండలను పెకలించెడి విశ్వాసం - కలిగి జీవించిననూ
అద్భుతంబగు ఆయన కృప లేనిదే - నా విశ్వాసము వ్యర్థమేగా ॥అ..॥
2. ఎంత తీవ్రతతో - ప్రార్థించినను - సేవకెంత ధనంబిచ్చినా
ఎంత ఆత్మశక్తితో - ప్రసంగించినను - అంత అణకువతో యుందుము ॥అ..॥
3. కృపావరము లెన్నెన్నో - కలిగియున్న - ఎన్ని మర్మము
లెరిగినను ఎంత మాధుర్యముగ - పాడగల్గినను - వినయము లేనిదే వ్యర్థము
4. ఎన్నో అధిక్యతలతో - కూడిన ఈ - గొప్ప సేవను మనకిచ్చెను
తగ్గించుకొందుమా - నిలచియుందుము - అంతంవరకు ఈ గొప్ప సేవలో ॥అ..॥
5. కృపచేతనే రక్షింపబడితిమి - కృపవల్లనన్ని పొందితిమి
కృపయందే చలించుచున్నాము మనం - కృపగల ప్రభుకే మహిమ ॥అ..॥
Mahima mahima - prabhuke mahima - maakennadu
Valadu sumaa ihalokamandu paralokamandu - prabhu yesunake mahima
A.pa a ... aanandame paramaanandame - adi maaku
aasheervaadame enta aunnatyamunaku ediginanu -
anta deenulamai yundumu.
1. kondalanu pekalinchedi vishvaasam - kaligi jeevinchinanoo
adbhutambagu aayana krupa lenide - naa vishvaasamu vyarthamegaa ॥a..॥
2. enta teevratato - praarthinchinanu - sevakenta dhanambichchinaa
enta aatmashaktito - prasanginchinanu - anta anakuvato yundumu ॥a..॥
3. krupaavaramu lennenno - kaligiyunna - enni marmamu
leriginanu enta maadhuryamuga - paadagalginanu - vinayamu lenide vyarthamu ॥a..॥
4. enno adhikyatalato - koodina ee - goppa sevanu manakichchenu
tagginchukondumaa - nilachiyundumu - antanvaraku ee goppa sevalo ॥a..॥
5. krupachetane rakshimpabaditimi - krupavallananni ponditimi
krupayande chalinchuchunnaamu manam - krupagala prabhuke mahima ॥a..॥
Comments
Post a Comment