నూతన వాగ్దానములతో
1. నూతన వాగ్దానములతో - ముత్యముల వరుసవలె మెరిసె
క్రొత్త వత్సరమును దానముగ =
అ.ప. ఖ్యాతిగా ప్రసాదించిన మా క్రీస్తు నీకే స్తుతులు
2. క్రొత్తవాత్సల్యము జూపించి - క్రొత్తదగు ఆత్మను
మాకొసగి - క్రొత్తదగు జన్మయనుభవము llఖ్యాతిగాll
3. నూతన సృష్టిగ మము జేసి - నూతన పురుషునిగను జేసి
నూతన గీతము మా నోట llఖ్యాతిగాll
4. ఇనుప గడియలు పగులగొట్టి - ఇత్తడి తలుపులు విడగొట్టి
అంధకార ధన వాగ్దానము llఖ్యాతిగాll
5. నిలచి మండే జ్వాలల మధ్య - నిధులలోబడి దాటువేళ
నదులలో పూర్ణ క్షేమము llఖ్యాతిగాll
6. క్రొత్త యెరుషలేమను పురము - క్రొత్తదగు నీ
నామధేయము క్రొత్త ఆకాశముల నిరీక్షణ llఖ్యాతిగాll
7. ముదిమి వచ్చువరకు నిన్ను- పదిలముగ నెత్తుకొనెదనని
ముదమున వాగ్దానములెన్నో llఖ్యాతిగాll
1. nootana vaagdaanamulato - mutyamula varusavale merise
krotta vatsaramunu daanamuga =
A.pa. khyaatigaa prasaadinchina maa kreestu neeke stutulu
2. krottavaatsalyamu joopinchi - krottadagu aatmanu
maakosagi - krottadagu janmayanubhavamu llkhyaatigaall
3. nootana srushtiga mamu jesi - nootana purushuniganu jesi
nootana geetamu maa nota llkhyaatigaall
4. inupa gadiyalu pagulagotti - ittadi talupulu vidagotti
andhakaara dhana vaagdaanamu llkhyaatigaall
5. nilachi mande jvaalala madhya - nidhulalobadi daatuvela
nadulalo poorna kshemamu llkhyaatigaall
6. krotta yerushalemanu puramu - krottadagu nee
naamadheyamu krotta aakaashamula nireekshana llkhyaatigaall
7. mudimi vachchuvaraku ninnu- padilamuga nettukonedanani
mudamuna vaagdaanamulenno llkhyaatigaall
Comments
Post a Comment