మణులు మాణిక్యములున్నా - మేడ మిద్దెలు ఎన్నున్న

మణులు మాణిక్యములున్నా - మేడ మిద్దెలు ఎన్నున్న
మదిలో యేసు లేకున్న ఏది ఉన్నా అది సున్న


1. చదువులెన్నో చదివున్నా పదవులెన్నో చేస్తున్నా
    విద్య ఉన్నా బుద్ధిఉన్నా జ్ఞానమున్నా అది సున్నా      ||మణులు||


2. అందచందాలెన్నున్నా అందలముపై కూర్చున్నా
    సుందరుడు ప్రభు లేకున్న అందమున్నా అది సున్నా   ॥మణులు||


3. రాజ్యములు రమణులు ఉన్నా శౌర్యముగల వీరులున్నా
    బలము ఉన్నా బలగమున్నా ఎన్ని ఉన్నా అవి సున్నా  ॥మణులు||


4. పూజ్యుడా పుణ్యాత్ముడా పుణ్యకార్య సిద్దుడా
    దాన ధర్మము జపము తపము యేసు లేనివి అన్నీ సున్నా ||మణులు||

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో