ప్రియ యేసు రాజునునే చూచిన చాలు
ప్రియ యేసు రాజునునే చూచిన చాలు
మహిమలో నేనాయనతో నుంటే చాలు - నిత్యమైన మోక్షగృహము
నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు
1. యేసుని రక్తమందు కడుగబడి - వాక్యముచే నిత్యం భద్రపరచబడి
నిష్కళంక పరిశుద్దులతో నేనుండెదన్ - బంగారు వీధులలో తిరిగెదను
2. దూతలు వీణెలను మీటునపుడు - గంభీర జయధ్వనులు మ్రోగునపుడు
హల్లెలూయ పాటల్ పాడుచుండ- ప్రియ యేసుతోను నేను యుల్లసింతున్
3. ముండ్ల మకుటంబైన తలను జూచి - స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్
కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి - ప్రతియొక్క గాయమును ముద్దాడెదన్
4. హృదయము స్తుతులతో నింపబడె నా భాగ్య గృహమును
స్మరించుచుంటే హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ - వర్ణింప నా నాలుక చాలదయ్యా
5. ఆహా ఆ బూర ఎపుడు ధ్వనించునో - ఆహా నా యాశ ఎపుడు తీరుతుందో
తండ్రి నా కన్నీటిని తుడుచునెపుడో - ఆశతో వేచియుండే నా హృదయం
Priya yesu raajunune choochina chaalu
Mahimalo nenaayanato nunte chaalu -
nityamaina mokshagruhamu
Nandu cheri bhaktula gumpulo
harshinchina chaalu
1. yesuni raktamandu kadugabadi -
vaakyamuche nityam bhadraparachabadi
nishkalanka parishuddulato nenundedan -
bangaaru veedhulalo tirigedanu
2. dootalu veenelanu meetunapudu -
gambheera jayadhvanulu mrogunapudu
hallelooya paatal paaduchunda-
priya yesutonu nenu yullasintun
3. mundla makutambaina talanu joochi -
svarna kireetam betti yaanandintun
koradaato kottabadina veepun joochi -
pratiyokka gaayamunu muddaadedan
4. hrudayamu stutulato nimpabade naa bhaagya gruhamunu
Smarinchuchunte hallelooya aamen hallelooya -
varnimpa naa naaluka chaaladayyaa
5. aahaa aa boora epudu dhvaninchuno -
aahaa naa yaasha epudu teerutundo
tandri naa kanneetini tuduchunepudo -
aashato vechiyunde naa hrudayam
Comments
Post a Comment