నీ జల్దరు వృక్షపు నీడలలో
నీ జల్దరు వృక్షపు నీడలలో - నే నానందభరితుడనైతిని
బలురక్కసి వృక్షపు గాయములు - ప్రేమా హస్తములతో తాకు ప్రభు
1. నా హృదయపు వాకిలి తీయమని - పలుదినములు మంచులో నిలిచితివి
నీ శిరము వానకు తడిసినను - నన్ను రక్షించుటకు వేచితివి llనీ జల్దరుll
2. ఓ ప్రియుడా నా అతిసుందరుడా - ధవళ వర్ణుడా నా కతి ప్రియుడా
వ్యసనాక్రాంతుడుగా మార్చబడి - నీ సొగసును నాకు నొసగితివి llనీ జల్దరుll
3. నీ పరిమళ పుష్ప సుగంథములు - నా రోత హృదయమును నింపినవి
ద్రాక్షారసధారుల కన్న మరి - నీ ప్రేమే ఎంతో అతిమధురం llనీ జల్దరుll
4. ఉన్నత శిఖరములు దాటుచును - ఇదిగో అతడొచ్చుచున్నాడు.
నా హృదయపు తలుపులు తెరచుకొని - నా ప్రియుని కొరకు కనిపెట్టెదనుllనీ జల్దరుll
5. నీ విందుశాలకు నడిపించి - రాజులు యాజకులతో జేర్చితివి
జీవాహారము నా కందించి - పరమాగీతములను నేర్పితివి llనీ జల్దరుll
nee jaldaru vrukshapu needalalo -
ne naanandabharitudanaitini
balurakkasi vrukshapu gaayamulu -
premaa hastamulato taaku prabhu
1. naa hrudayapu vaakili teeyamani -
paludinamulu manchulo nilichitivi
nee shiramu vaanaku tadisinanu -
nannu rakshinchutaku vechitivi llnee jaldarull
2. o priyudaa naa atisundarudaa -
dhavala varnudaa naa kati priyudaa
vyasanaakraantudugaa maarchabadi -
nee sogasunu naaku nosagitivi llnee jaldarull
3. nee parimala pushpa suganthamulu -
naa rota hrudayamunu nimpinavi
draakshaarasadhaarula kanna mari -
nee preme ento atimadhuran llnee jaldarull
4. unnata shikharamulu daatuchunu -
idigo atadochchuchunnaadu.
Naa hrudayapu talupulu terachukoni -
naa priyuni koraku kanipettedanu llnee jaldarull
5. nee vindushaalaku nadipinchi -
raajulu yaajakulato jerchitivi
jeevaahaaramu naa kandinchi -
paramaageetamulanu nerpitivi llnee jaldarull
Comments
Post a Comment