ప్రభువు గొప్పవాడు - స్తోత్రింప దగినవాడు

ప్రభువు గొప్పవాడు - స్తోత్రింప దగినవాడు

ఆయన మహాత్యమును - గ్రహించు వారెవరు
వెళ్ళెదం - చెప్పెదం - ఈ భూమంతా ప్రకటించెదము


1. కర్తను స్తుతియించుడి - దీర్ఘశాంతము గలవాడే
    దయదాక్షిణ్య సంపూర్ణుడే - కృపాతిశయుడతడే ॥వెళ్ళెదం||


2. తరాతరములందు - దైవక్రియలను కొనియాడుచు
    స్తోత్రములతో గానముచేసి - ప్రకటింప రారండి   ||వెళ్ళెదం||


3. దేవుని పిల్లలారా - ప్రభుహస్త పరాక్రమమున్
    ఎరిగి రుచించి వర్ణించుటకు - త్వరపడిరారండి   ||వెళ్ళెదం||


4. దేవా నీ రాజ్యం - శాశ్వత పరిపాలన
    భారతదేశమంతట త్వరలో - నెలకొల్ప ప్రార్ధించుడి   ||వెళ్ళెదం|| Prabhuvu goppavaadu - stotrimpa daginavaadu Aayana mahaatyamunu - grahinchu vaarevaru Velledam - cheppedam - ee bhoomantaa prakatinchedamu 1. kartanu stutiyinchudi - deerghashaantamu galavaade dayadaakshinya sampoornude - krupaatishayudatade ॥velledan|| 2. taraataramulandu - daivakriyalanu koniyaaduchu stotramulato gaanamuchesi - prakatimpa raarandi ||velledan|| 3. devuni pillalaaraa - prabhuhasta paraakramamun erigi ruchinchi varninchutaku - tvarapadiraarandi ||velledan|| 4. devaa nee raajyam - shaashvata paripaalana bhaaratadeshamantata tvaralo - nelakolpa praardhinchudi ||velledan||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు