భయపడను నేను భయపడను

భయపడను నేను భయపడను (2)

యేసు నాతో ఉన్నందున - భయపడను నేను భయపడను


1. నూతనవత్సర కిరీటమును - దయతో నొసగిన మాదేవా
    నీవు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను


2. మరణ భయము నన్ను చుట్టినను - మరణ లోయలో నడిచినను
    యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను


3. వ్యాధి బాధలు కల్గినను - వైద్యులే నన్ను విడచినను
    యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను


4. సాతాను నను శోధించినను - హింసలెన్నో కలిగినను
    యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను


5. వెనుక ఉన్నవి మరచెదను - ముందున్న వాటికై సాగెదను
    యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను


6. దేవునిపైనే ఆనుకొనెదను - ఆత్మ స్వరమునే వినుచుందును
    ఆత్మ నాతో ఉన్నందున భయపడను నేను భయపడను


7. ప్రవాహములు పొర్లినను - అగ్నిలో నేను నడచినను
    యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను


8. గొల్యాతు ఎదురుగా వచ్చినను - ఘోర తుఫాను వీచినను
    యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను Bhayapadanu nenu bhayapadanu (2) Yesu naato unnanduna - bhayapadanu nenu bhayapadanu 1. nootanavatsara kireetamunu - dayato nosagina maadevaa neevu naato unnanduna bhayapadanu nenu bhayapadanu 2. marana bhayamu nannu chuttinanu - marana loyalo nadichinanu yesu naato unnanduna bhayapadanu nenu bhayapadanu 3. vyaadhi baadhalu kalginanu - vaidyule nannu vidachinanu yesu naato unnanduna bhayapadanu nenu bhayapadanu 4. saataanu nanu shodhinchinanu - hinsalenno kaliginanu yesu naato unnanduna bhayapadanu nenu bhayapadanu 5. venuka unnavi marachedanu - mundunna vaatikai saagedanu yesu naato unnanduna bhayapadanu nenu bhayapadanu 6. devunipaine aanukonedanu - aatma svaramune vinuchundunu aatma naato unnanduna bhayapadanu nenu bhayapadanu 7. pravaahamulu porlinanu - agnilo nenu nadachinanu yesu naato unnanduna bhayapadanu nenu bhayapadanu 8. golyaatu edurugaa vachchinanu - ghora tuphaanu veechinanu yesu naato unnanduna bhayapadanu nenu bhayapadanu

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు