మంగళమే యేసునకు - మనుజావతారునకు
మంగళమే యేసునకు - మనుజావతారునకు =
శృంగార ప్రభువునకు - క్షేమాధిపతికి ||మంగళమే||
1. పరమ పవిత్రునకు - వరదివ్య తేజునకు =
నిరుపమానందునకు - నిపుణవేద్యునకు ||మంగళమే॥
2. దురిత సంహారునకు - వరసుగుణోదారునకు =
కరుణా సంపన్నునకు - జ్ఞానదీప్తునకు ||మంగళమే॥
3. సత్య ప్రవర్తునకు - సద్ధర్మశీలునకు =
నిత్య స్వయంజీవునకు - నిర్మలాత్మునకు ||మంగళమే||
4. యుక్తస్తోత్రార్హునకు - భక్తరక్షామణికి =
సత్యపరంజ్యోతియగు - సార్వభౌమునకు ॥మంగళమే||
5. నరఘోర కలుషముల నురుమారంగ నిల =
కరుదెంచిన మాపాలి - వరరక్షకునకు ||మంగళమే||
6. పరమ పురివాసునకు - నరదైవ రూపునకు =
పరమేశ్వర తనయునకు - బ్రణుతింతుము నిన్ను ||మంగళమే||
mangalame yesunaku - manujaavataarunaku =
shrungaara prabhuvunaku - kshemaadhipatiki ||mangalame||
1. parama pavitrunaku - varadivya tejunaku =
nirupamaanandunaku - nipunavedyunaku ||mangalame॥
2. durita sanhaarunaku - varasugunodaarunaku =
karunaa sampannunaku - jnyaanadeeptunaku ||mangalame॥
3. satya pravartunaku - saddharmasheelunaku =
nitya svayanjeevunaku - nirmalaatmunaku ||mangalame||
4. yuktastotraarhunaku - bhaktarakshaamaniki =
satyaparanjyotiyagu - saarvabhaumunaku ॥mangalame||
5. naraghora kalushamula nurumaaranga nila =
karudenchina maapaali - vararakshakunaku ||mangalame||
6. parama purivaasunaku - naradaiva roopunaku =
parameshvara tanayunaku - branutintumu ninnu ||mangalame||
Comments
Post a Comment