ప్రభు యేసుని శుభవార్త పరిచర్యలో
ప్రభు యేసుని శుభవార్త పరిచర్యలో - పాలివారై యుండుటయే
పావనుండొసగిన కృప కదా - పామరుల భాగ్యమే
1. దారి తొలగిన వారిని - కూర్మితో దరి చేర్చుటకు
దానముగా తన ప్రాణమును - అర్పించిన ప్రభు త్యాగమును
ప్రకటింపకుండ జీవించగలమా - దీనులకు శుభవార్తను ||ప్రభు||
2. ప్రతి వంశము ప్రతి జాతి - పలు భాషలు ప్రజలందరిని
మోక్ష నివాసుల జేయ - ప్రభువెంతో ఆశింపగా
ప్రకటింపకుండ జీవించగలమా - దీనులకు శుభవార్తను ||ప్రభు|| Prabhu yesuni shubhavaarta paricharyalo - paalivaarai yundutaye Paavanundosagina krupa kadaa - paamarula bhaagyame 1. daari tolagina vaarini - koormito dari cherchutaku daanamugaa tana praanamunu - arpinchina prabhu tyaagamunu prakatimpakunda jeevinchagalamaa - deenulaku shubhavaartanu ||prabhu|| 2. prati vanshamu prati jaati - palu bhaashalu prajalandarini moksha nivaasula jeya - prabhuvento aashimpagaa prakatimpakunda jeevinchagalamaa - deenulaku shubhavaartanu ||prabhu||
Comments
Post a Comment