మారుచున్న సమాజములోన - మారని యువకులు లేవాలి

మారుచున్న సమాజములోన - మారని యువకులు లేవాలి
మారని యేసు - మార్గములోన - మరలక నడవాలి       llమారుll


1. చదువులలో పదవులలో - పెదవులలో హృదయములో (2)
    మాటలలోన - పాటలలోన (2)


అ.ప..   పరిశుద్ధతయే కావాలి  పరివర్తనయే రావాలి       llమారుll


2. చూపులలో రూపులలో కోరికలో తీరికలో (2)
    అందములోన - బంధములోన (2)    ॥పరిశుద్ధతయే||


3. మోదములో భేదములో - శోధనలో రోదనలో (2)
    సాధనలోన - వాదనలోన (2)          ॥పరిశుద్ధతయే॥


4. శౌర్యములో ధైర్యములో - సౌఖ్యములో ఐక్యములో (2)
    సంఘములోన - రంగములోన (2)    ॥పరిశుద్ధతయే|


5. సేవలలో త్రోవలలో - వేడుకలో కూడికలో (2)
    కవళికలోన - గమనికలోన (2)         ॥పరిశుద్ధతయే॥


6. జ్ఞానములో ధ్యానములో - గానములో దానములో
    భోనములోన - పానములోన (2)                  ॥పరిశుద్ధతయే॥

    పరిశుద్ధతయే కావాలి పరివర్తనమే రావాలి            llమారుll Maaruchunna samaajamulona - maarani yuvakulu levaali Maarani yesu - maargamulona - maralaka nadavaali llmaarull 1. chaduvulalo padavulalo - pedavulalo hrudayamulo (2) maatalalona - paatalalona (2) A.pa.. parishuddhataye kaavaali parivartanaye raavaali llmaarull 2. choopulalo roopulalo korikalo teerikalo (2) andamulona - bandhamulona (2) ॥parishuddhataye|| 3. modamulo bhedamulo - shodhanalo rodanalo (2) saadhanalona - vaadanalona (2) ॥parishuddhataye॥ 4. shauryamulo dhairyamulo - saukhyamulo aikyamulo (2) sanghamulona - rangamulona (2) ॥parishuddhataye| 5. sevalalo trovalalo - vedukalo koodikalo (2) kavalikalona - gamanikalona (2) ॥parishuddhataye॥ 6. jnyaanamulo dhyaanamulo - gaanamulo daanamulo bhonamulona - paanamulona (2) ॥parishuddhataye॥ parishuddhataye kaavaali parivartaname raavaali llmaarull


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో