నా జీవిత వ్యధలందు - యేసే జవాబు

  నా జీవిత వ్యధలందు - యేసే జవాబు
    యేసే జవాబు - ప్రభు యేసే జవాబు


1. తీరని మమతలతో ఆరని మంటలతో
    ఆశనిరాశలతో - తూలెను నాబ్రతుకే ॥నను॥


అ.ప. ననుగని వచ్చెను - తన కృపనిచ్చెను
        కరుణతో ప్రేమించి కలుషము బాపెను


2. చీకటి వీధులలో నీటుగా నడిచితిని
  లోకపుటుచ్చులలో - శోకము చూచితిని ॥నను॥


3. ద్రోహుల నమ్ముకొని - స్నేహము జేసితిని
    యిడుముల పాట్టేసి - ఎడబాసిరి నన్ను ॥నను||


4. హంగుల వేషములో రంగుల వలయములో
    నింగికి నేనెగిరి - నేలను వ్రాలితిని ॥నను॥


5. పాపాత్ముడ నన్ను పరదైసును చేర్చ
    కలువరి గిరిలోన - చిందిన రుధిరముతో
॥నను॥ naa jeevita vyadhalandu - yese javaabu yese javaabu - prabhu yese javaabu 1. teerani mamatalato aarani mantalato aashaniraashalato - toolenu naabratuke ॥nanu॥ A.pa. nanugani vachchenu - tana krupanichchenu karunato preminchi kalushamu baapenu 2. cheekati veedhulalo neetugaa nadichitini lokaputuchchulalo - shokamu choochitini ॥nanu॥ 3. drohula nammukoni - snehamu jesitini yidumula paattesi - edabaasiri nannu ॥nanu|| 4. hangula veshamulo rangula valayamulo ningiki nenegiri - nelanu vraalitini ॥nanu॥ 5. paapaatmuda nannu paradaisunu chercha kaluvari girilona - chindina rudhiramuto ॥nanu॥


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు