పరమ రాజ్యమునకు నరులు తిరిగి
పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు ననుచు =
బరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను llపరమll
1. వేదశాస్త్ర మెఱిగినట్టి యూదుల యధికారియౌని = కోదే మనెడు పరిసయుండు మదిని దలచుచున్ llపరమll
2. అతడు రాత్రివేళ ప్రభుని - వెతకి పోయి యెదుట స = మ్మతిని నిలిచి పిలిచి పల్కె హితవుతోడను ॥పరమll
3. బోధకుండ నీవు మోక్ష- నాధుడౌ యెహోవా యొక్క= వేద వార్త జెప్పెదవు నీ - బోధ నెఱుగుదున్ llపరమll
4. మరియు నీవు చేయుచున్న- గురుతు లెవ్వరైన దైవ = వరము లేని యట్టి పాప - నరులు చేయరు ॥పరమll
5. అనుచు బరిసయుండు పల్క - వినుచు యేసు కనికరమున = దనకు నిట్లు దెలిపె జాలి - మనసుతోడను llపరమll
6. క్రొత్తజన్మ మెవ్వడైన - నెత్త కున్న మోక్షమమునకు = నెత్తబడడటంచు నిజము - క్రీస్తు పల్కెను llపరమll
7. వినుచు బరిసయుండు ముసలి - జనుడు మరల తల్లి గర్భ = మునను తిరుగనెట్లు బుట్టు - ననుచు బల్కెను llపరమll
8. అందు కేసు తెల్పె జలము - నందు నాత్మయందు జన్మ = మొందకున్న మోక్ష రాజ్య - మొంద రనుచును llపరమll
Parama raajyamunaku narulu tirigi puttavalayu nanuchu= Barama guruvu yesukreestu sthiramu chesenu llparamall 1. vedashaastra meriginatti yoodula yadhikaariyauni = kode manedu parisayundu madini dalachuchun llparamall 2. atadu raatrivela prabhuni - vetaki poyi yeduta sa = mmatini nilichi pilichi palke hitavutodanu ॥paramall 3. bodhakunda neevu moksha- naadhudau yehovaa yokka= veda vaarta jeppedavu nee - bodha nerugudun llparamall 4. mariyu neevu cheyuchunna- gurutu levvaraina daiva = varamu leni yatti paapa - narulu cheyaru ॥paramall 5. anuchu barisayundu palka - vinuchu yesu kanikaramuna = danaku nitlu delipe jaali - manasutodanu llparamall 6. krottajanma mevvadaina - netta kunna mokshamamunaku = nettabadadatanchu nijamu - kreestu palkenu llparamall 7. vinuchu barisayundu musali - janudu marala talli garbha = munanu tiruganetlu buttu - nanuchu balkenu llparamall 8. andu kesu telpe jalamu - nandu naatmayandu janma = mondakunna moksha raajya - monda ranuchunu llparamall
Comments
Post a Comment