నీ జీవితం విలువైనది
నీ జీవితం విలువైనది - ఏనాడు ఏమరకు
శ్రీ యేసునామం నీకెంతో క్షేమం - ఈనాడే యోచించుమా
ఓ నేస్తమా తెలియునా ప్రభుయేసు నిన్ను ప్రేమించెను
నా నేస్తమా తెలుసుకో ప్రభుయేసు నీకై మరణించెను
1. బలమైన పెనుగాలి వీచి - అలలెంతో పైపైకిలేచి
విలువైన నీ జీవిత నావ - తలక్రిందులై వాలిపోవ
అ.ప. వలదు భయము నీకేల కలడు యేసు నీతోడు
యేసు మరణించి మరిలేచెను నిన్ను ప్రేమించి దరిజేర్చును
2. గాఢాంధకారంపు లోయలో - వడగాలి వడి సవ్వడిలో
నడయాడె నీ జీవిత త్రోవ - సుడివడి అడుగులు తడబడగా ||వలదు||
3. కనలేని గమ్యంబు కోరి - ఎనలేని కష్టాలపాలై
మనలేని నీ జీవితగాధ - కలలన్నీ కన్నీటి వ్యధలే ||వలదు||
nee jeevitam viluvainadi - enaadu emaraku
shree yesunaamam neekento kshemam - eenaade yochinchumaa
o nestamaa teliyunaa prabhuyesu ninnu preminchenu
naa nestamaa telusuko prabhuyesu neekai maraninchenu
1. balamaina penugaali veechi - alalento paipaikilechi
viluvaina nee jeevita naava - talakrindulai vaalipova
A.pa. valadu bhayamu neekela kaladu yesu neetodu
yesu maraninchi marilechenu ninnu preminchi darijerchunu
2. gaadhaandhakaarampu loyalo - vadagaali vadi savvadilo
nadayaade nee jeevita trova - sudivadi adugulu tadabadagaa ||valadu||
3. kanaleni gamyambu kori - enaleni kashtaalapaalai
manaleni nee jeevitagaadha - kalalannee kanneeti vyadhale ||valadu||
Comments
Post a Comment