నీతో సమమెవరు - నీలా ప్రేమించేదెవరూ
నీతో సమమెవరు - నీలా ప్రేమించేదెవరూ - నీలా క్షమియించేదెవరూ - యేసయ్యా - నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? (2)
1. లోక బంగారము ధన ధాన్యాదులు - ఒక పోగేసినా - నీతో సరితూగునా
జీవ నదులన్నియు సర్వ సంద్రములు - ఒక్కటై ఎగసిన - నిన్ను తాకగలవా ?
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవెగా మంచి దేవుడవు (2) ॥నీతో॥
2. పలు వేదాలలో మత గ్రంథాలలో - పాపమే సోకని - పరిశుద్ధుడేడి
పాప పరిహారార్ధం - శిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు
నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి - నీవెగా విమోచకుడు(2) ॥నీతో॥
3. నేను వెదుక కున్నా- నాకు దొరికితివి - నే ప్రేమించకున్నా- నన్ను ప్రేమించితివి
నీకు గాయాలు చేసి - తరచు రేపితిని - నన్నెంతో సహించి - క్షమించితివి
లోక సౌఖ్యాలన్ని ఒకచోట కుమ్మరించినా - నీవేగా చాలిన దేవుడు ॥నీతో॥
Neeto samamevaru - neelaa preminchedevaroo - neelaa kshamiyinchedevaroo -
Yesayyaa - neelaa paapikai praanam pettina vaarevaru? (2)
1. loka bangaaramu dhana dhaanyaadulu - oka pogesinaa - neeto saritoogunaa
jeeva nadulanniyu sarva sandramulu - okkatai egasina - ninnu taakagalavaa ?
neelaa parishuddha devudevarunnaarayyaa neevegaa manchi devudavu (2) ॥neeto॥
2. palu vedaalalo mata granthaalalo - paapame sokani - parishuddhudedi
paapa parihaaraardham - shiluva maranamondi tirigi lechinatti daiva narudevvaru
neelaa jaaligala premagala devudedi - neevegaa vimochakudu(2) ॥neeto॥
3. nenu veduka kunnaa- naaku dorikitivi - ne preminchakunnaa- nannu preminchitivi
neeku gaayaalu chesi - tarachu repitini - nannento sahinchi - kshaminchitivi
loka saukhyaalanni okachota kummarinchinaa - neevegaa chaalina devudu ॥neeto॥
Comments
Post a Comment