నిన్ను నేను విడువను దేవ

నిన్ను నేను విడువను దేవ - నీవు నను దీవించు వరకు=
నిన్ను నేను విడువను దేవ

నిన్ను నమ్మిన వారల నెల్ల - నీవు చక్కగ దీవించెదవు


1. నేను శత్రువునై యుండంగ - నీవు నాపై నెనరు జూపి =
    దాన మిచ్చితివి నాకొరకు - దారుడౌ నీప్రియ పుత్రుని ॥నిన్ను॥


2. త్రోవ దప్పి తిరుగుచుండ - దుడుకునైన నన్ను గాంచి =
    ప్రోవగోరి-మదిని నీవు - త్రోవను బెట్టితివి నన్ను ॥నిన్ను॥


3. నాటనుండి నేటి వరకు - నాకు గల్గిన శోధనములలో =
  నేటుగా - నను గాచిన వాడవు - నీవు గావా ఓ నా తండ్రి ॥నిన్ను॥



4. ఇంతకాలము నన్ను గాచి - యికను నన్ను విడువ వనుచు=
    సంతసించి మదిని నేను - చక్కగ నీదరి జేరితిని ॥నిన్ను॥


5. నీవు గాక యెవరున్నారు - నేలపైన నను గాపాడ = చేవలేని
    నాకు నీవు - చేవ గలుగజేయగలవు ॥నిన్ను॥


6. అడుగు వారి కిచ్చెద నంచు - నానతిచ్చినావు గాన=నడిగెద -
    నిను సాహాయ్యంబు - నాత్మవై యున్నట్టి తండ్రి ॥నిన్ను॥


7. నాదు ప్రార్థన లన్నియు నీవు - నీదు కృపచే నాలకించి=నీదు
    సరణిని నిల్పి నన్ను - నేర్పు దనరగ రక్షించితివి
॥నిన్ను॥ Ninnu nenu viduvanu deva - neevu nanu deevinchu varaku= Ninnu nenu viduvanu deva Ninnu nammina vaarala nella - neevu chakkaga deevinchedavu 1. nenu shatruvunai yundanga - neevu naapai nenaru joopi = daana michchitivi naakoraku - daarudau neepriya putruni ॥ninnu॥ 2. trova dappi tiruguchunda - dudukunaina nannu gaanchi = provagori-madini neevu - trovanu bettitivi nannu ॥ninnu॥ 3. naatanundi neti varaku - naaku galgina shodhanamulalo = netugaa - nanu gaachina vaadavu - neevu gaavaa o naa tandri ॥ninnu॥ 4. intakaalamu nannu gaachi - yikanu nannu viduva vanuchu= santasinchi madini nenu - chakkaga needari jeritini ॥ninnu॥ 5. neevu gaaka yevarunnaaru - nelapaina nanu gaapaada = chevaleni naaku neevu - cheva galugajeyagalavu ॥ninnu॥ 6. adugu vaari kichcheda nanchu - naanatichchinaavu gaana=nadigeda - ninu saahaayyambu - naatmavai yunnatti tandri ॥ninnu॥ 7. naadu praarthana lanniyu neevu - needu krupache naalakinchi=needu saranini nilpi nannu - nerpu danaraga rakshinchitivi ॥ninnu॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు