భజనచేయుచు భక్తపాలక - ప్రస్తుతింతు నీ నామమును

భజనచేయుచు భక్తపాలక - ప్రస్తుతింతు నీ నామమును
వృజినములపై జయము నిచ్చిన - విజయుడా నిను వేడుకొందు ॥


1. దివ్యపదవిని విడిచి నీవు - దీనుడవై పుట్టినావు
    భవ్యమైన బోధలెన్నో - బాగుగా ధరనేర్పినావు ॥భజన॥


2. నరుల గావను పరమునుండి - ధరకు నీవు వచ్చినావు
    పరుడనైన నాకొరకు నీ - ప్రాణము నర్పించినావు ||భజన॥


3. చెడినవాడనైన నన్ను - జేరదీసి బ్రోచినావు
    పడిన నాదు గోతి నుండి - పైకి లేవనెత్తినావు ॥భజన॥


4. ఎంత ప్రేమ యెంత దయ - యెంత కృప యేసయ్య నీకు
    ఇంతయని వర్ణింప నిలలో - నెవనికిని సాధ్యంబు కాదు   ||భజన॥ Bhajanacheyuchu bhaktapaalaka - prastutintu nee naamamunu Vrujinamulapai jayamu nichchina - vijayudaa ninu vedukondu ॥bhajana॥ 1. divyapadavini vidichi neevu - deenudavai puttinaavu bhavyamaina bodhalenno - baagugaa dharanerpinaavu ॥bhajana॥ 2. narula gaavanu paramunundi - dharaku neevu vachchinaavu parudanaina naakoraku nee - praanamu narpinchinaavu ||bhajana॥ 3. chedinavaadanaina nannu - jeradeesi brochinaavu padina naadu goti nundi - paiki levanettinaavu ॥bhajana॥ 4. enta prema yenta daya - yenta krupa yesayya neeku intayani varnimpa nilalo - nevanikini saadhyambu kaadu ||bhajana॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు