నాదు జీవితము మారిపోయినది

నాదు జీవితము మారిపోయినది- నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా

1. చాలునయ్యా దేవా ఈ జన్మధన్యమే ప్రభువా పాపకూపము విడిచి నీదారి నడిచితి దేవా- నిన్నాశ్రయించితి ప్రభువా  ||నాదు||

2. కన్నుగానని దిశగా బహుదూర మేగితినయ్యా
నీ ప్రేమ వాక్యము వినగా నా కళ్లు కరిగెను దేవా - నిన్నాశ్రయించితి ప్రభువా ||నాదు||

3. లోకమంతా విషమై నరకాగ్ని జ్వాలలు రేగే
ఆ దారి నడవక నన్ను కాపాడి నావని దేవా - నిన్నాశ్రయించితి ప్రభువా  ||నాదు||

4. జాలిగల నా దేవా నీ చేయి చాపవా ప్రభువా
 చేరగ నీ దరికి నే పాపినయ్యా ప్రభువా - నే పాపినయ్యా ప్రభువా ॥నాదు||

5. ఆరిపోని జ్యోతివై కన్నులలోని కాంతివై
ఎంతకాలముంటివి ఎంతగా ప్రేమించితివి - నన్నెంతగా ప్రేమించితివి  ||నాదు|| naadu jeevitamu maaripoyinadi - ninnaashrayinchina vela nannaadukontivi prabhuvaa 1. chaalunayyaa devaa ee janmadhanyame prabhuvaa paapakoopamu vidichi needaari nadichiti devaa- ninnaashrayinchiti prabhuvaa ||naadu|| 2. kannugaanani dishagaa bahudoora megitinayyaa nee prema vaakyamu vinagaa naa kallu karigenu devaa - ninnaashrayinchiti prabhuvaa ||naadu|| 3. lokamantaa vishamai narakaagni jvaalalu rege aa daari nadavaka nannu kaapaadi naavani devaa - ninnaashrayinchiti prabhuvaa ||naadu|| 4. jaaligala naa devaa nee cheyi chaapavaa prabhuvaa cheraga nee dariki ne paapinayyaa prabhuvaa - ne paapinayyaa prabhuvaa ॥naadu|| 5. aariponi jyotivai kannulaloni kaantivai entakaalamuntivi entagaa preminchitivi - nannentagaa preminchitivi ||naadu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు