నీవు తోడై యున్నజాలు - యేసు

 నీవు తోడై యున్నజాలు - యేసు - నిత్యము నాకది మేలు =
 నీవు ధరణినుండు - నీచపాపుల నెల్లగావ బ్రేమ వచ్చి - ఘన ప్రాణ మిడినట్టి


1. నిను బోలు రక్షకుం డేడి -  క్రీస్తు - నను బోలు పాతకుం డేడి =
    నిను నమ్ము వారలకు - నీ వొసగుచుందువు - తనర పాపక్షమ - దయచేత నిలలోన                     ||నీవు||


2. నీ పాటి బలవంతు డేడి - ప్రభు - నాపాటి దుర్బలుం డేడి =
    కాపాడు చుందువు- కలకాలమును నీవు -
    నీ పాద సేవకుల - నీ నేర్పురంజిల్ల     ||నీవు||


3. నీ వంటి యుపకారి యేడి - కర్త - నావంటి కడు దీను దేడి
    జీవులకును గల్గు - జీవంబు లిచ్చుచు - జీవాధారము లొసగి - జీవుల బ్రోచెడి                      ||నీవు||


4. నీ వంటి ధనవంతుడేడి - యేసు - నావంటి ధనహీను డేడి
    ప్రోవులై యున్నవి - యీవులు నీయందు

    నీవు వాని నొసంగి నిరతంబు నను గావు                ||నీవు|| neevu todai yunnajaalu - yesu - nityamu naakadi melu = neevu dharaninundu - neechapaapula nellagaava brema vachchi - ghana praana midinatti 1. ninu bolu rakshakum dedi - kreestu - nanu bolu paatakum dedi = ninu nammu vaaralaku - nee vosaguchunduvu - tanara paapakshama - dayacheta nilalona ||neevu|| 2. nee paati balavantu dedi - prabhu - naapaati durbalum dedi = kaapaadu chunduvu- kalakaalamunu neevu - nee paada sevakula - nee nerpuranjilla ||neevu|| 3. nee vanti yupakaari yedi - karta - naavanti kadu deenu dedi jeevulakunu galgu - jeevambu lichchuchu - jeevaadhaaramu losagi - jeevula brochedi ||neevu||

4. nee vanti dhanavantudedi - yesu - naavanti dhanaheenu dedi provulai yunnavi - yeevulu neeyandu neevu vaani nosangi niratambu nanu gaavu ||neevu||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు