ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది

ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది
నిజము - దీనిని నమ్ము - ఇది భువి యందించలేనిది


అ.ప. ॥ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్యప్రేమ
            ఎన్నడు వీడనిది నా యేసుని నిత్యప్రేమ ॥


1. తల్లిదండ్రుల ప్రేమ - నీడవలె గతియించును
    కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును ||ప్రేమ||


2. బంధు మిత్రుల ప్రేమ - వెలుగుచున్న ప్రేమ దీపమే
    నూనె ఉన్నంతకాలమే - వెలుగునిచ్చి ఆరిపోవును ||ప్రేమ||


3. భార్యాభర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము
    వాడిపోయి రాలును త్వరలో - మోడులా మిగిలిపోవును   ||ప్రేమ||


4. ధరణిలోని ప్రేమలన్నియు - స్థిరముకావు తరగిపోవును
    క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును
||ప్రేమ|| Prema yesuni prema - adi evvaru koluvalenidi Nijamu - deenini nammu - idi bhuvi yandinchalenidi A.pa. ॥ ennadennadu maaranidi naa yesuni divyaprema ennadu veedanidi naa yesuni nityaprema ॥ 1. tallidandrula prema - needavale gatiyinchunu kannabiddala prema - kalalaa karigipovunu ||prema|| 2. bandhu mitrula prema - veluguchunna prema deepame noone unnantakaalame - velugunichchi aaripovunu ||prema|| 3. bhaaryaabhartala madhya - vikasinchina prema pushpamu vaadipoyi raalunu tvaralo - modulaa migilipovunu ||prema|| 4. dharaniloni premalanniyu - sthiramukaavu taragipovunu kreestu yesu kalvari prema kadavaraku aadarinchunu ||prema||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు