నాకు నీ కృప చాలును

నాకు నీ కృప చాలును ప్రియుడా నాకు నీ కృప చాలును
శ్రమలతో నిండిన అరణ్య జీవితములో - నాకు నీ కృప చాలును ప్రియుడా


1.జతలేని పావురమువలె నేను - మూలుగుచున్నాను నీదరి చేరుటకు

   నాధా నీ రాక అలస్యమైతే జారకుండా కాపాడుము నన్ను
  పడకుండ నిలువబెట్టుము ॥నాకు॥


2. సింహపు బోనులో ననువేసినను అగ్ని మధ్యలో నను పడవేసినను    
  హృదయము కలవరపడు సమయములో
  జారకుండ కాపాడుము నన్ను - పడకుండ నిలువబెట్టుము  ॥నాకు॥

3. ఆశ్రయించుటకు స్థలమే లేదు - ఆదరణ పొందుటకు మనుష్యుడు లేడు
    సంపూర్ణ జీవము కలిగిన నాధా - నీవే నా ఆధారము యిలలో నీవే నా ఆదరణ ॥నాకు॥ Naaku nee krupa chaalunu priyudaa naaku nee krupa chaalunu Shramalato nindina aranya jeevitamulo - naaku nee krupa chaalunu priyudaa 1.jataleni paavuramuvale nenu - mooluguchunnaanu needari cherutaku naadhaa nee raaka alasyamaite j aarakundaa kaapaadumu nannu padakunda niluvabettumu ॥naaku॥ 2. sinhapu bonulo nanuvesinanu agni madhyalo nanu padavesinanu hrudayamu kalavarapadu samayamulo

jaarakunda kaapaadumu nannu -

padakunda niluvabettumu ॥naaku॥ 3. aashrayinchutaku sthalame ledu -

aadarana pondutaku manushyudu ledu sampoorna jeevamu kaligina naadhaa -

neeve naa aadhaaramu yilalo neeve naa aadarana ॥naaku॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు