షారోను రోజాయేసే పరిపూర్ణ సుందరుడు
షారోను రోజాయేసే పరిపూర్ణ సుందరుడు (2)
ప్రేమమూర్తి యని ఆదరించువాడని - ప్రాణప్రియుని కనుగొంటిని
అ.ప : అడవులైన లోయలైన ప్రభు వెంట నేను వెళ్ళెదను (2)
1. యేసుని యెరుగని వారెందరో - వాంఛతో వెళ్ళుటకు ఎవరు ఉన్నారు.
దప్పికతో ఉండిన ప్రభువునకై - సిలువను మోసేవారెవరు ||అడవు||
2. పాపముల ధికములగుచున్నవి - పరిశుద్ధులనేకులు మరణించారే
అంతము వరకు నిలిచియుండి - ఆయన మార్గములో వెళ్ళేదెవరు ||అడవు||
3. అరణ్యము పోలిన గ్రామాలలో - అసంఖ్యాకు లైనవారు బ్రతుకుచున్నారు
ఏమియు లేనివారికాహారమిచ్చి - ఆయన మార్గంలో సాగేదెవరు ||అడవు||
4. సీయోను వాసి జడియకుము - పిలిచినవాడు నమ్మదగినవాడు
చేసిన సేవను మరువక - ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును ||అడవు||
Comments
Post a Comment