నన్ను గన్నయ్య రావె నా యేసు

నన్ను గన్నయ్య రావె నా యేసు - నన్ను గన్నయ్య రావె - నా ప్రభువా


1. ముందు నీ పాదారవిందము - లందు నిశ్చల భక్తి ప్రేమను =
  పొందికగా జేయరావే నా - డెందమానంద మనంతమై యుప్పొంగ ॥నన్ను॥


2. హద్దులేనట్టి దురాశల - నవివేకినై కూడి యాడితి =
  మొద్దులతో నింక కూటమి - వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ॥నన్ను॥


3. కాలము పెక్కు గతించెను - గర్వాదు లెడదెగ వాయెను =
  ఈ లోకమాయ సుభేచ్ఛలు - చాలును జాలును జాలునో తండ్రి ॥నన్ను॥


4. దారుణ సంసారవారధి - దరిజూపి ప్రోవ నీకన్నను =
  కారణ గురువు లింకెవ్వరు - లేరయ్య - లేరయ్య లేరయ్య తండ్రి ॥నన్ను॥


5. నావంటి దుష్కర జీవిని - కేవలమగు నీదు పేర్మిని =
  దీవించి రక్షింప నిప్పుడే - రావయ్య రావయ్య రావయ్య తండ్రి ॥నన్ను॥ Nannu gannayya raave naa yesu - nannu gannayya raave - naa prabhuvaa 1. mundu nee paadaaravindamu - landu nishchala bhakti premanu = pondikagaa jeyaraave naa - dendamaananda manantamai yupponga ॥nannu॥ 2. haddulenatti duraashala - navivekinai koodi yaaditi = moddulato ninka kootami - vaddayya vaddayya vaddayya tandri ॥nannu॥ 3. kaalamu pekku gatinchenu - garvaadu ledadega vaayenu = ee lokamaaya subhechchhalu - chaalunu jaalunu jaaluno tandri ॥nannu॥ 4. daaruna sansaaravaaradhi - darijoopi prova neekannanu = kaarana guruvu linkevvaru - lerayya - lerayya lerayya tandri ॥nannu॥ 5. naavanti dushkara jeevini - kevalamagu needu permini = deevinchi rakshimpa nippude - raavayya raavayya raavayya tandri ॥nannu॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు