నజరేతువాడా నిన్ను చూడాలి
నజరేతువాడా నిన్ను చూడాలి - నా యేసు నాధా నిన్ను చేరాలి
నీదు రక్తధారలే నను కడగాలి - నీదు సాక్షిగా, నేను బ్రతకాలి
హల్లెలూయ పాటలు - ఆనందగీతికలు
నా జీవిత కాలమంత గానమాలపించాలి ॥నజ॥
1. నీ స్వస్థత కావాలి నీదు మాటలే వినాలి - నా జీవిత కాలమంతా
నీ గానము చేయాలి - నీ రెక్కల చాటున నేను దాగియుండాలి
నా ప్రాణనాధుడా - నీ స్తోత్రగీతి పాడాలి (2). ॥నజ॥
2. నీదు అడుగుజాడలందు నేను సాగిపోవాలి
నీ జల్దరు నీడలోన నేను విశ్రమించాలి - భూదిగంతవాసులంత నీవే రారాజు వనుచు - నీ దివ్యసన్నిధి చేరి నవ్యగీతి పాడాలి (2) ॥నజ॥
3. నీ నామము ఎరుగని వారి, కడకు నేను పోవాలి - నీ దివ్య ప్రేమ
సువార్త లోకమంత చాటాలి నీ సిలువ శాంతిలో - నీ కరుణ కాంతిలో
నా జీవిత కాలమంతా నేను సాగిపోవాలి (2) ॥నజ॥
Najaretuvaadaa ninnu choodaali - naa yesu naadhaa ninnu cheraali Needu raktadhaarale nanu kadagaali - needu saakshigaa, nenu bratakaali Hallelooya paatalu - aanandageetikalu Naa jeevita kaalamanta gaanamaalapinchaali ॥naja॥ 1. nee svasthata kaavaali needu maatale vinaali - naa jeevita kaalamantaa nee gaanamu cheyaali - nee rekkala chaatuna nenu daagiyundaali naa praananaadhudaa - nee stotrageeti paadaali (2). ॥naja॥ 2. needu adugujaadalandu nenu saagipovaali nee jaldaru needalona nenu vishraminchaali - bhoodigantavaasulanta neeve raaraaju vanuchu - nee divyasannidhi cheri navyageeti paadaali (2) ॥naja॥ 3. nee naamamu erugani vaari, kadaku nenu povaali - nee divya prema suvaarta lokamanta chaataali nee siluva shaantilo - nee karuna kaantilo naa jeevita kaalamantaa nenu saagipovaali (2) ॥naja॥
Comments
Post a Comment