క్రైస్తవ కర్షకా కదలిరావయ్యా

క్రైస్తవ కర్షకా కదలిరావయ్యా - కన్నులు తెరచి కానవేమయ్యా
కోతకాలము గడిచిపోయే - గ్రీష్మకాలము కూడ జరిగిపోయె   ll క్రైస్తవ ll

1. మనుష్య కుమారుడైన క్రీస్తుయేసు - మంచి విత్తనమును విత్తేమున్ను    

    భూలోకంబునెడు పొలంబునందున -
    వాక్యంబనే విత్తనంబు విత్తెను  ll క్రైస్తవ ll


2. ఆదిమ క్రైస్తవ బోధకులు - వేదనతోను వాక్యంబు విత్తి
    రోదనతోను రక్తంబును కార్చి
    ప్రాణంబులను దానంబు చేసిరి  ll క్రైస్తవ ll


3. చల్లిన వాక్యము ఫలియింపను - తొలకరి వర్షము కురిపించెను
    విలువైన ఫలములు ఫలియించువరకు -
    కడవరి వర్షము కొరకు వేడుదం  ll క్రైస్తవ ll

4. పొలములు తెల్లబారె తేరిచూడు - కాలము చాలగతించిపోయె
    కోత యజమానుడైన క్రీస్తుని -
    కోతవారిని బంప కోరి వేడుదం  ll క్రైస్తవ ll


5. శత్రువగు సాతానుకూడా - చెడ్డ విత్తనములు చల్లిపోయె
  గోధుమల మధ్య గురుగులు కూడ -
  ఘోరంబుగాను పెరుగుచుండెను  ll క్రైస్తవ ll


6. కన్నీళ్ళతో విత్తు క్రైస్తవుండ - కలవర మొందెద వెందులకు
    సంతోషముతో సంగీతాలతోను -
    సాగిపోవుదం ఆగిపోకను  ll క్రైస్తవ ll


7. ప్రతివాని జీతము - పట్టుకొని ప్రభుయేసు త్వరగా వచ్చుచుండె
  ఆనంద భాష్పాలు - ఆయనే తుడువన్
    హల్లెలూయయని ఆనందించెదం  ll క్రైస్తవ ll Kraistava karshakaa kadaliraavayyaa - kannulu terachi kaanavemayyaa Kotakaalamu gadichipoye - greeshmakaalamu kooda jarigipoye ll kraistava ll 1. manushya kumaarudaina kreestuyesu - manchi vittanamunu vittemunnu bhoolokambunedu polambunanduna - vaakyambane vittanambu vittenu ll kraistava ll 2. aadima kraistava bodhakulu - vedanatonu vaakyambu vitti rodanatonu raktambunu kaarchi praanambulanu daanambu chesiri ll kraistava ll 3. challina vaakyamu phaliyimpanu - tolakari varshamu kuripinchenu viluvaina phalamulu phaliyinchuvaraku - kadavari varshamu koraku vedudam ll kraistava ll 4. polamulu tellabaare terichoodu - kaalamu chaalagatinchipoye kota yajamaanudaina kreestuni - kotavaarini bampa kori vedudam ll kraistava ll 5. shatruvagu saataanukoodaa - chedda vittanamulu challipoye godhumala madhya gurugulu kooda - ghorambugaanu peruguchundenu ll kraistava ll 6. kanneellato vittu kraistavunda - kalavara mondeda vendulaku santoshamuto sangeetaalatonu - saagipovudam aagipokanu ll kraistava ll 7. prativaani jeetamu - pattukoni prabhuyesu tvaragaa vachchuchunde aananda bhaashpaalu - aayane tuduvan hallelooyayani aanandinchedam ll kraistava ll

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు