గురియొద్దకే పరుగిడుచుంటిని
గురియొద్దకే పరుగిడుచుంటిని - క్రీస్తు నీ పిలుపుతో
బహుమానము పొందు రీతిని అలయక వెనుతిరుగక (2)
యేసులో కొనసాగెదన్ (నా) యేసుతో కొనసాగెదన్ (2)
కొండలైనా లోయలైన - యేసుతో కొనసాగెదన్ (2)
1 నాగటి పైన చేయి నిలిపి వెనుక చూడక కొనసాగెదన్
కన్నీరుకార్చి దేవుని వాక్యం - మనుష్య హృదయములో నాటెదన్ (2)
ఎన్నడు దున్నబడని - భూమిని నేదున్నెదన్ (2)
కొండలైనా లోయలైనా - యేసుతో కొనసాగెదన్
2 సిలువను మోయుచు - క్రీస్తు ప్రేమను ఊరువాడల నే చాటెదన్
శిరమును వంచి కరములు జోడించి- ప్రార్థనాత్మతో నే వేడెదన్ (2)
సిలువ ప్రేమ నాలో - ప్రజలకు చూపింతును (2)
కొండలైనా లోయలైనా - యేసుతో కొనసాగెదన్ (2)
3. నాశనమునకు జోగువారిని - క్రీస్తు ప్రేమతో రక్షింతును
నరకము నుండి మోక్షమునకు - మార్గమేసని ప్రకటింతును
నేను వెళ్లెదన్ - వెళ్ళువారిని నే పంపెదన్ (2)
కొండలైనా లోయలైనా - యేసుతో కొనసాగెదన్ (2)
Comments
Post a Comment