కృప జూపవా - కరుణించవా

కృప జూపవా - కరుణించవా కూర్మితో నను నింపవా – దేవా దేవా ఆత్మతో ననునింపవా ||కృప|| 1. గాలికి కదులాడు - రెల్లును బోలు నాదు జీవితము ఎండిన మోడు కురుపించు ఒక జల్లు మొలిపించు చిగురు- ఫలియించునట్లు నిలిచుండునట్లు ||కృప|| 2. నా పొరుగువారిని ప్రేమించునట్లు హింసించు వారిని దీవించునట్లు అవునంటే అవునని కాదంటే కాదని ఉప్పు వేసినట్లు నా మాట లుండన్ ||కృప|| 3. జీవించునది యిక నేను కాదనచు నాయందు మీరు నివసించగాను నా జీవితమె మీకు పత్రికగాను ఈ జగతి నా బ్రతుకే సాక్ష్యమవునట్లు||కృప|| 4. నాయందు మీరు మీయందు నేను నిత్యము కలసి జీవించునట్లు ఉప్పువలె వెలుగువలెను లోకమునందు నే వెలుగునట్లు ||కృప|| 5. నీ మాటలు విని ఆలాగు చేసి బండమీద నేను నా యిల్లు కట్టి వానలు కురిసిన వరదలు వచ్చిన నిత్యము నా యిల్లు నిలచి యుండునట్లు ||కృప|| Krupa joopavaa - karuninchavaa Koormito nanu nimpavaa – Devaa devaa aatmato nanunimpavaa ||krupa|| 1. gaaliki kadulaadu - rellunu bolu naadu jeevitamu endina modu kurupinchu oka jallu molipinchu chiguru- phaliyinchunatlu nilichundunatlu ||krupa|| 2. naa poruguvaarini preminchunatlu hinsinchu vaarini deevinchunatlu avunante avunani kaadante kaadani uppu vesinatlu naa maata lundan ||krupa|| 3. jeevinchunadi yika nenu kaadanachu naayandu meeru nivasinchagaanu naa jeevitame meeku patrikagaanu ee jagati naa bratuke saakshyamavunatlu||krupa|| 4. naayandu meeru meeyandu nenu nityamu kalasi jeevinchunatlu uppuvale veluguvalenu lokamunandu ne velugunatlu ||krupa|| 5. nee maatalu vini aalaagu chesi bandameeda nenu naa yillu katti vaanalu kurisina varadalu vachchina nityamu naa yillu nilachi yundunatlu ||krupa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు