గీతం గీతం జయజయ గీతం
గీతం గీతం జయజయ గీతం - చేయితట్టి పాడెదము
యేసురాజు లేచెను - హల్లెలూయ జయమార్భటించెదము llగీతంll
1. చూడు సమాధిని మూసినరాయి దొరలుచు పరుగిడెను
అందువేసిన ముద్ర-కావలి నిల్చెనా - దైవసుతునిముందు llగీతంll
2. వలదు వలదు ఏడువవలదు - వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి llగీతంll
3. అన్న, కయప వారల సభయు - అదరుచు పరుగిడిరి
ఇంక దూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి llగీతంll
4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయవీరుడు రాగా
మీ మేళతాళ వాద్యముల్ - బూరలెత్తి ధ్వనించుడీ llగీతంll
Comments
Post a Comment