గగనము చీల్చుకొని యేసు ఘనులను
గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని
వేలాది దూతలతో భువికి వేగమే రానుండె ॥గగనము॥
1. పరలోక పెద్దలతో పరివారముతో కదలి
ధర సంఘ వధువునకై తరలెను వరుడదిగో ॥గగనము॥
2. మొదటిగను గొజ్జెగను ముదమారగ ప్రభువచ్చెన్
కొదమ సింహపు రీతి కదలెను ఘర్జనతో ॥గగనము॥
3. కనిపెట్టు భక్తాళి కనురెప్పలో మారెదరు
ప్రధమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు ॥గగనము॥
4. ఆకాశ మధ్యమున ప్రకాశమానుండై
లోకాన రారాజై శోకము తొలగించు ॥గగనముll
Gaganamu cheelchukoni yesu ghanulanu teesukoni
Velaadi dootalato bhuviki vegame raanunde ॥gaganamu॥
1. paraloka peddalato parivaaramuto kadali
dhara sangha vadhuvunakai taralenu varudadigo ॥gaganamu॥
2. modatiganu gojjeganu mudamaaraga prabhuvachchen
kodama sinhapu reeti kadalenu gharjanato ॥gaganamu॥
3. kanipettu bhaktaali kanureppalo maaredaru
pradhamamuna lechedaru parishuddhulu mrutulu ॥gaganamu॥
4. aakaasha madhyamuna prakaashamaanundai
lokaana raaraajai shokamu tolaginchu ॥gaganamull
Comments
Post a Comment