కుమ్మరీ ఓ కుమ్మరీ.. జగదుత్పత్తిదారీ
కుమ్మరీ ఓ కుమ్మరీ.. జగదుత్పత్తిదారీ....
జిగట మన్నయిన నా వంక చల్లగ చూడుమయా ॥కుమ్మరీ॥
1. పనికి రాని పాత్రననీ పారవేయకుమా - పొంగి పొరలు పాత్రగచేసి నన్ను నింపుమా
సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసునే పొగడుచుండ
సాక్షిగ నుండు పాత్రగ జేసి సత్యముతో నింపుము తండ్రీ ॥కుమ్మరీ॥
2. యోగ్యమైన పాత్రగా - పావనపరచుమా
ఘనతకైన పాత్రగా సిద్ధము చేయుమా ॥కుమ్మరీ॥
3. లేఖన మందలి పాత్రలు- యేసుని స్తుతియించెను
నన్నును అటువంటి పాత్రగా - మార్చివేయుమా ॥కుమ్మరీ॥
4. విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరూ
వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగ జేసి
ఆటంకముల నుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా ॥కుమ్మరీ॥ Kummaree o kummaree.. jagadutpattidaaree.... Jigata mannayina naa vanka challaga choodumayaa ॥kummaree॥ 1. paniki raani paatrananee paaraveyakumaa - pongi poralu paatragachesi nannu nimpumaa suvaartaloni paatralannee shree yesune pogaduchunda saakshiga nundu paatraga jesi satyamuto nimpumu tandree ॥kummaree॥ 2. yogyamaina paatragaa - paavanaparachumaa ghanatakaina paatragaa siddhamu cheyumaa ॥kummaree॥ 3. lekhana mandali paatralu- yesuni stutiyinchenu nannunu atuvanti paatragaa - maarchiveyumaa ॥kummaree॥ 4. viluvaleni paatranu nenu - konuvaaru lerevvaroo velaleni needu raktambuto velugondu paatraga jesi aatankamula nundi tappinchi nannu - ellappudu kaavumayyaa pagiliyunna paatranu nenu sarichesi vaadumayyaa ॥kummaree॥
Comments
Post a Comment