గొప్ప దేవ నాకు తండ్రివి-యాకాశమందు
గొప్ప దేవ నాకు తండ్రివి-యాకాశమందు - గొప్ప దేవ నాకు తండ్రివి
తప్పకుండ వత్తు నీ - దరికి యేసు నామమందు - గొప్ప కరుణ చేత న -
న్నిప్పుడు తగజేర్చుకొనుము ||గొప్ప||
1. నీవు మిగుల గొప్పవాడవు - నా సృష్టికర్త - యీవు లెపుడు నిచ్చు వా
డవు = భావమందు నిను దలంచి - పావనాత్మ నాకు నిచ్చి - జీవమార్గమంది
నిలిపి-కావు మనుచు వేడుకొందు ||గొప్ప||
2. చిన్నవాని నంగి ప్రార్తన - నీ లోకమందు - మున్ను దయను విన్న వాడవు
సన్నుతుడగు యేసు నీదు - సన్నిధి నున్నాడు గాన - నన్ను గనికరించు
మనుచు నిన్ను నమ్మి వత్తు నిపుడు ||గొప్ప||
3. విలువ గల్గు నీదు నాజ్ఞలు - నా హృదయమందు - బలు విధముల దల
చు చుందును = బలుకులందు బనులయందు - బలము జూపి నిన్ను
గొలిచి - యిలను నిన్ను బ్రీతిపరుతు - నలయక నీ కరుణ మెయిని ||గొప్ప||
4. మీది రాజ్యమందు జేర్చుము - కరుణాసముద్ర - బీద నైన నన్ను
గరుణచే = సోదరులను గూడికొనుచు - మోద మొప్పగ నీదు సేవ -
బాదు కొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి ||గొప్ప||
Goppa deva naaku tandrivi-yaakaashamandu -
goppa deva naaku tandrivi
Tappakunda vattu nee - dariki yesu naamamandu -
goppa karuna cheta na -
Nnippudu tagajerchukonumu ||goppa||
1. neevu migula goppavaadavu - naa srushtikarta -
yeevu lepudu nichchu vaa
davu = bhaavamandu ninu dalanchi - paavanaatma naaku nichchi - jeevamaargamandi nilipi-kaavu manuchu vedukondu ||goppa|| 2. chinnavaani nangi praartana - nee lokamandu - munnu dayanu vinna vaadavu Sannutudagu yesu needu - sannidhi nunnaadu gaana - nannu ganikarinchu Manuchu ninnu nammi vattu nipudu ||goppa|| 3. viluva galgu needu naajnyalu - naa hrudayamandu - balu vidhamula dala chu chundunu = balukulandu banulayandu - balamu joopi ninnu golichi - yilanu ninnu breetiparutu - nalayaka nee karuna meyini ||goppa|| 4. meedi raajyamandu jerchumu - karunaasamudra - beeda naina nannu garunache = sodarulanu goodikonuchu - moda moppaga needu seva - baadu konuchu nundunu nee paadapadmamulanubatti ||goppa||
Comments
Post a Comment