యేసునాధుని పూజింతుము

  యేసునాధుని పూజింతుము స్తుతించుచు నాధుని పొగడెదము 

     స్తుతించుచు నాధుని పొగడెదము - స్తుతించెదము ||యేసు||


1. ఆహా ఆనందం - యేసుని సన్నిధి ఆశీర్వాదము సదా పెరుగుచుండె
    అదే నిజ మహోత్సవము ఆయన నింక విడువనె ॥యేసు॥

2. కరుణతో మమ్ముల నలంకరించుచును - కఠిన సమయములందాదరించె
    కృపా సత్యములను గ్రహించె కృతజ్ఞత నా యేసునకే   ॥యేసు॥


3. వత్సరమంతయు విశ్వాసమిచ్చి విజయదినోత్సవమనుగ్రహించెన్
    పాపక్షమాపణ నిచ్చి పరిశుద్ధ మార్గం చూపెన్ ॥యేసు॥


4. బాటనందాపదల్ సంభవించినను పీడించు వ్యాధులు పెరిగినను
    అధైర్యమే ఎదుర్కొనిన అనుదినం స్తుతించెదనె ||యేసు||


5. ప్రేమపాశములనుదినం రుచి చూపి పాలించి నడిపించు ఈ ఏడు
    అనాదియు అంతము మీరే అనాధుల సొంతము మీరే ॥యేసు॥


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో