కోరుదును నేను - నా యేసు పాదములు
కోరుదును నేను - నా యేసు పాదములు
నా యేసు పాద విశేషము - వర్ణనాతీతం
1. సత్య వార్తను చాటుటకు నా - ప్రభుని పాదములు
పరుగులెత్తెను భువియందంతట - పరము చేర్చుటకు llకోరుll
2. గ్రుడ్డి, చెవిటి మూగవారిని - స్వస్థపరచుటకు
వారి లోపముల్ తీర్చుటకును - పరుగులెత్తిన పాదములు llకోరుll
3. కుష్టులను శుద్ధులుగ జేయన్ - సంచరించినవి
మృతులను సజీవులనుగ - లేప వెళ్ళిన పాదములు llకోరుll
4. నేలపైన నడచిన రీతిగ - సంద్రముపై నడచెన్
శిష్యబృందము నేర్పరచను - దరికి వెళ్ళిన పాదములు llకోరుll
5. పర్వతారణ్యములలో - ప్రార్ధనలు సలుపన్
పరమ ఉపదేశములు చేయున్ - వెళ్ళిన రమ్యపాదములు llకోరుll
6. సిలువ మోయుచు కల్వరిగిరికి - వెళ్ళిన పాదములు
సాతాను తల చితుక ద్రొక్కిన - సిలువ వేసిన పాదములు llకోరుll
Korudunu nenu - naa yesu paadamulu Naa yesu paada visheshamu - varnanaateetam 1. satya vaartanu chaatutaku naa - prabhuni paadamulu parugulettenu bhuviyandantata - paramu cherchutaku llkorull 2. gruddi, cheviti moogavaarini - svasthaparachutaku vaari lopamul teerchutakunu - parugulettina paadamulu llkorull 3. kushtulanu shuddhuluga jeyan - sancharinchinavi mrutulanu sajeevulanuga - lepa vellina paadamulu llkorull 4. nelapaina nadachina reetiga - sandramupai nadachen shishyabrundamu nerparachanu - dariki vellina paadamulu llkorull 5. parvataaranyamulalo - praardhanalu salupan parama upadeshamulu cheyun - vellina ramyapaadamulu llkorull 6. siluva moyuchu kalvarigiriki - vellina paadamulu saataanu tala chituka drokkina - siluva vesina paadamulu llkorull
Comments
Post a Comment