క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా
క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నీరాక ఏక్షణమో
నా కన్నీరు తుడచుటకు - నన్నాదరించుటకు
నా యేసువా మేఘములపైన వేగిరమే రారమ్ము llక్రీస్తేll
1. మధ్యాకాశములో పరలోక దూతలతో వచ్చే వేళ
నా కొరకు గాయపడిన నీ మోమును ముద్దాడుటకు
నీటి కొరకై వేచిన గూడ బాతువలె వాంఛించెదన్ llక్రీస్తేll
2. ధవళవస్త్రం ధరియించిన పరిశుద్ధుల సంఘమది
నీ దరికిచేరి నేను హల్లెలూయ పాడుటకు
బుద్ధిగల నిర్మల కన్యకన్ పోలి సిద్ధపడెదన్ llక్రీస్తేll
3. సూర్యచంద్ర తారల నే దాటి పరదైసులో
ఆ స్పటిక నది తీరాన జీవ వృక్ష నీడలో
నిత్యమైన నివాసం చేయుటకు వేచియుంటిన్ llక్రీస్తేll
Kreestesuvaa naa priya naayakudaa neeraaka ekshanamo
Naa kanneeru tudachutaku - nannaadarinchutaku
Naa yesuvaa meghamulapaina vegirame raarammu llkreestell
1. madhyaakaashamulo paraloka dootalato vachche vela
naa koraku gaayapadina nee momunu muddaadutaku
neeti korakai vechina gooda baatuvale vaanchhinchedan llkreestell
2. dhavalavastram dhariyinchina parishuddhula sanghamadi
nee darikicheri nenu hallelooya paadutaku
buddhigala nirmala kanyakan poli siddhapadedan llkreestell
3. sooryachandra taarala ne daati paradaisulo
aa spatika nadi teeraana jeeva vruksha needalo
nityamaina nivaasam cheyutaku vechiyuntin llkreestell
Comments
Post a Comment