ఇన్నేళ్లు యిలలో ఉన్నాము

ఇన్నేళ్లు యిలలో ఉన్నాము మనము - చల్లని దేవుని నీడలో
గతించిపోయే కాలము - స్మరించు యేసు నామము సంతోషించు ఈ నవోదయం


1. లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం పరలోకమే
    మనకు శాశ్వతం పరలోక దేవుడే నిత్యజీవం -   ప్రేమామయుడే ఆ
    పరమాత్ముడే పదిల పరచె ఈ రక్షణ భాగ్యం                                llఇన్నేll


2. మారుమనస్సు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం
    నీ పూర్ణ హృదయముతో సేవించుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా
    పరిపూర్ణుడే పరిశుద్దాత్ముడే కరుణించునులే నిన్ను కలకాలం        llఇన్నేll

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు