దేవదేవుని స్తుతించెదము

దేవదేవుని స్తుతించెదము - దేవుని కృపను పొందెదము

ఒకే మనస్సుతో ప్రభు నామమున్- స్తుతులు చెల్లించి పొగడెదము


హల్లెలూయ దేవునికే - హల్లెలూయ ప్రభువునకే

హల్లెలూయ శుద్ధాత్మునకే - హల్లెలూయ రాజునకే


1. మా పాదముల్ జారకుండ  -  మా నడతలు స్థిరపరచు
    కనుపాపవలె కాపాడును కృపతో నిత్యము నడిపించును llహల్లెll


2. దేవ నీదు సముఖమును నిత్యము ఉంచి నడిపించుము- సాతాన్ని
    నిత్యము జయించుటకు దేవబలముతో నింపు నన్ను llహల్లెll


3. బ్రతుకు దినములన్నిటిలో కృపాక్షేమముల్ వెంటవచ్చున్
    దైవవాక్యముకు లోబడెదం దైవరూపము పొందెదము llహల్లెll


4. అనుదినము ప్రభుయేసు నాకు ఆశ్రయం దుర్గమై యుండును
  కలిమిలేమి ఏ స్థితిలో నాదు ఆశ్రయం యేసయ్య llహల్లెll Devadevuni stutinchedamu - devuni krupanu pondedamu Oke manassuto prabhu naamamun- stutulu chellinchi pogadedamu Hallelooya devunike - hallelooya prabhuvunake Hallelooya shuddhaatmunake - hallelooya raajunake 1. maa paadamul jaarakunda - maa nadatalu sthiraparachu kanupaapavale kaapaadunu krupato nityamu nadipinchunu llhallell 2. deva needu samukhamunu nityamu unchi nadipinchumu- saataanni nityamu jayinchutaku devabalamuto nimpu nannu llhallell 3. bratuku dinamulannitilo krupaakshemamul ventavachchun daivavaakyamuku lobadedam daivaroopamu pondedamu llhallell 4. anudinamu prabhuyesu naaku aashrayam durgamai yundunu kalimilemi e sthitilo naadu aashrayam yesayya llhallell

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు