దేవదూతల భాషలతో నేను మాట్లాడిన
దేవదూతల భాషలతో నేను మాట్లాడిన - మాట్లాడిన ప్రవచించు
కృప వరముల్ - నాకుండిన ప్రేమలేని వాడనైన వట్టివాడను
యిదియే క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ యిది ॥దేవ॥
1. కొండలను నేను పెకిలించిన - బండలు బ్రద్దలుగా చేసినను
ఆకాశంబు పైకి ఎగిరిపోయినను-ప్రేమలేనివాడనైన వట్టివాడను ॥దేవ॥
2. పేరుకు మాత్రము క్రైస్తవుడా ఊరకనే చేరము యెరూషలేము
ఓర్పు సహనంబును క్షమాపణ ప్రేమ లేనివాడనైతే వట్టివాడను ॥దేవ॥
3. ఎంత విద్యను అభ్యసించిన ఎంత ఔన్నత్యమునకు
నేను పోయినను గొప్ప పదవులలో - నేను తిరిగినను
ప్రేమలేని వాడనైతే వట్టివాడను ॥దేవ॥
4. లోకమంతయు నాకుండిన కొదువ లేమియు
నాకు లేకుండిన అందరిని మించు అందంబు
నాకుండిన ప్రేమలేని వాడనైన వట్టివాడను ॥దేవ॥
Devadootala bhaashalato nenu maatlaadina -
maatlaadina pravachinchu
Krupa varamul - naakundina
premaleni vaadanaina vattivaadanu
Yidiye kreestu kalvarilo choopinchina prema yidi ॥deva॥
1. kondalanu nenu pekilinchina -
bandalu braddalugaa chesinanu
aakaashambu paiki egiripoyinanu-
premalenivaadanaina vattivaadanu ॥deva॥
2. peruku maatramu kraistavudaa
oorakane cheramu yerooshalemu
orpu sahanambunu kshamaapana prema
lenivaadanaite vattivaadanu ॥deva॥
3. enta vidyanu abhyasinchina enta aunnatyamunaku
nenu poyinanu goppa padavulalo - nenu tiriginanu
premaleni vaadanaite vattivaadanu ॥deva॥
4. lokamantayu naakundina koduva lemiyu
naaku lekundina andarini minchu andambu
naakundina premaleni vaadanaina vattivaadanu ॥deva॥
Comments
Post a Comment