దూత పాట పాడుఁడీ
1. దూత పాట పాడుఁడీ - రక్షకున్ స్తుతించుఁడీ
ఆ ప్రభుండు పుట్టెను - బెత్లహేము నందునన్
భూజనంబు కెల్లను - సౌఖ్యసంభ్ర మాయెను
ఆకసంబునందున - మ్రోగు పాట చాటుడీ
దూత పాట పాడుడీ – రక్షకున్ స్తుతించుడీ
2. ఊర్ధ్వలోకమందున - గొల్వగాను శుద్ధులు
అంత్యకాలమందున - కన్యగర్భమందున
బుట్టినట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా - నిన్ను నెన్న శక్యమా ?
దూత పాట పాడుడీ - రక్షకున్ స్తుతించుడీ
3. రావె నీతిసూర్యుడా - రావె దేవపుత్రుడా
నీదు రాకవల్లను- లోక సౌఖ్య మాయెను
భూనివాసు లందఱు - మృత్యుభీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి - ఆత్మశుద్ధి కల్గును
దూత పాట పాడుడీ - రక్షకున్ స్తుతించుడీ
1. doota paata paadumdee - rakshakun stutinchumdee
aa prabhundu puttenu - betlahemu nandunan
bhoojanambu kellanu - saukhyasambhra maayenu
aakasambunanduna - mrogu paata chaatudee
doota paata paadudee – rakshakun stutinchudee
2. oordhvalokamanduna - golvagaanu shuddhulu
antyakaalamanduna - kanyagarbhamanduna
buttinatti rakshakaa - o immaanuyel prabho
o naraavataarudaa - ninnu nenna shakyamaa ?
doota paata paadudee - rakshakun stutinchudee
3. raave neetisooryudaa - raave devaputrudaa
needu raakavallanu- loka saukhya maayenu
bhoonivaasu landaru - mrutyubheeti gelturu
ninnu nammuvaariki - aatmashuddhi kalgunu
doota paata paadudee - rakshakun stutinchudee
Comments
Post a Comment