దేవా మా కుటుంబము నీ సేవకే

దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
ఈ శాప లోకాన నీ సాక్షులుగా నిలువ -  నీ ఆత్మతో నింపుమా  (2)


1. కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు
  మాకేమి భయము మాకేమి దిగులు
  నీకే వందనములయ్యా లోబడి జీవింతుము-లోపంబులు సవరించుము
  లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా వుందుము


2. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను
    లోక వ్యసనముల తాకుడు లేకుండా
    దాచుము నీ చేతులలో ఓలీవ మొక్కల వలెను ద్రాక్ష తీగలను పోలి
    ఫల సంపదలతోను కలకాలం జీవించ కురిపించుము నీ దీవెనలని


3. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము - నెమ్మది గల ఇల్లు నిమ్మళమగు మనస్సు          ఇమ్మహిలో మాకిమ్మయ్య ఇమ్ముగా దయచేయుము గిన్నె నిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగా- మమ్ములను బలపరచుము


4. పెంపారజేయుము మాలో సొంపుగా నీ ఘన ప్రేమన్
నింపుము హృదయముల శాంతి భాగ్యములతో
సంతసంబుగా సాగెదము వింతైన నీ ప్రేమను అంతటా ప్రకటింతుము
కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంత జేరగా కోరెదము

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో