దేవుడు మనకు ఎల్లప్పుడు
దేవుడు మనకు ఎల్లప్పుడు - తోడుగ నున్నాడు (3)
1. ఏదేనులో ఆదాముతో నుండెన్ - హానోకు తోడ నేగెను
దీర్ఘ దర్శకులతో నుండెన్ - ధన్యులు దేవుని గలవారు (2) ||తోడు||
2. దైవాజ్ఞను శిరసావహించి - దివ్యముగ నబ్రాహాము
కన్న కొమరుని ఖండించుటకు - ఖడ్గమునెత్తిన యపుడు ||తోడు||
3. యోసేపు ద్వేషించబడినపుడు - గోతిలో త్రోయబడినపుడు
శోధనలో చెఱసాలయందు - సింహాసన మెక్కిన యపుడు ||తోడు||
4. ఫరోరాజు తరిమిన యపుడు - ఎర్రసముద్రపు తీరమున
యోర్దాను నది దాటునపుడు - ఎరికో కూలిన యపుడు ||తోడు||
5. దావీదు సింహము నెదిరించి - ధైర్యాన చీల్చిన యపుడు
గొల్యాతును హతమార్చిన యపుడు - సౌలుచే తరమబడినపుడు ||తోడు||
6. సింహపు బోనులో దానియేలు - షద్రకు మేషాక బెద్నగో
అగ్నిగుండములో వేయబడన్ - నల్గురుగా కనబడినపుడు ||తోడు||
7. పౌలు బంధించబడినపుడు - పేతురు చెఱలో నున్నపుడు
అపోస్తలులు విశ్వాసులు - హింసించబడిన యపుడు ||తోడు||
Devudu manaku ellappudu - toduga nunnaadu (3)
1. edenulo aadaamuto nunden - haanoku toda negenu
deergha darshakulato nunden - dhanyulu devuni galavaaru (2) ||todu||
2. daivaajnyanu shirasaavahinchi - divyamuga nabraahaamu
kanna komaruni khandinchutaku - khadgamunettina yapudu ||todu||
3. yosepu dveshinchabadinapudu - gotilo troyabadinapudu
shodhanalo cherasaalayandu - sinhaasana mekkina yapudu ||todu||
4. pharoraaju tarimina yapudu - errasamudrapu teeramuna
yordaanu nadi daatunapudu - eriko koolina yapudu ||todu||
5. daaveedu sinhamu nedirinchi - dhairyaana cheelchina yapudu
golyaatunu hatamaarchina yapudu - sauluche taramabadinapudu ||todu||
6. sinhapu bonulo daaniyelu - shadraku meshaaka bednago
agnigundamulo veyabadan - nalgurugaa kanabadinapudu ||todu||
7. paulu bandhinchabadinapudu - peturu cheralo nunnapudu
apostalulu vishvaasulu - hinsinchabadina yapudu ||todu||
Comments
Post a Comment