దాసుల ప్రార్థన దప్పక యొసగెడు

దాసుల ప్రార్థన దప్పక యొసగెడు - యేసు నాయకుడె మా వేల్పు
దోషములు సేయు దుర్జనుడైనను - దోసి లొగ్గ పరవాసి జేయునట llదాసుll


1. జన రహిత స్థలమున జని వేడెడి -  మనుజుల ప్రార్ధన వినుచుండున్
  తన పాదము నమ్మిన సాధూత్తమ -  జనులను చూచిన సంతస మిడునట  ॥దాసు॥


2. మది విశ్వాసము గూడిన ప్రార్ధన -  సదయత వినుటకు జెవులొగ్గున్
  హృదయము కనుగొని యుచిత సమయమున - గుదురుగ భక్తుల కోర్కెలిచ్చునట


3. ముదమున నిద్దరు ముగ్గురు నొకచో -  బదిలముగా దను బ్రార్దింపన్
  వదలక దానట వచ్చి యుందునని - మృదువుగ బలికిన కృత రక్షణుడట    ॥దాసు॥ Daasula praarthana dappaka yosagedu - yesu naayakude maa velpu Doshamulu seyu durjanudainanu - dosi logga paravaasi jeyunata lldaasull 1. jana rahita sthalamuna jani vededi - manujula praardhana vinuchundun tana paadamu nammina saadhoottama - janulanu choochina santasa midunata ॥daasu॥ 2. madi vishvaasamu goodina praardhana - sadayata vinutaku jevuloggun hrudayamu kanugoni yuchita samayamuna - guduruga bhaktula korkelichchunata ॥daasu॥ 3. mudamuna niddaru mugguru nokacho - badilamugaa danu braardimpan vadalaka daanata vachchi yundunani - mruduvuga balikina kruta rakshanudata ॥daasu॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు