దేవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీ - మంతుడగు యెహోవా
సంస్తుతి చేయవే మనసా = దేవ సంస్తుతి చేయుమా నా -
జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా
నా యంతరంగము - లో వసించునో సమస్తమా
1. జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్లన్ మరువకు =
నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు - లేవియున్
లేకుండ జేయును - ఆ కారణముచే ॥దేవ॥
2. చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను కృపను =
జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద జీవ కిరీటముగ
వేయును - ఆ కారణముచే ॥దేవ॥
3. యౌవనంబు పక్షిరాజు - యౌవనంబు వలెనె క్రొత్త =
యౌవనంబై వెలయునట్లుగ - మే లిచ్చి నీదు -
భావమును సంతుష్టిపరచునుగా - ఆకారణముచే ॥దేవ॥
4. ప్రభువు నీతి పనులు చేయున్ - బాధితులకు న్యాయ మిచ్చున్ =
విభుడు మార్గము తెలిపె, మోషేకు - దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే ॥దేవ॥
5. అత్యధిక ప్రేమ స్వరూపి - యైన దీర్ఘ శాంతపరుడు -
నిత్యము వ్యాజ్యంబు చేయడు ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోపముంచడు ఆ కారణముచే ॥దేవ॥
6. పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు=
భూమికన్న నాకసంబున్న - యెత్తుండు దైవ - ప్రేమ
భక్తి జనుల యందున - ఆ కారణముచే ॥దేవ॥
7. పడమటికి దూర్పెంత యెడమో - పాపములకును
మనకు నంత = యెడము కలుగజేసియున్నాడు మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే ॥దేవ॥
8. కొడుకులపై దండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల=
యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల -
యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే ॥దేవ॥
9. మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న
సంగతి = మనము మంటివార మంచును - జ్ఞాపకముచేసి
కొనుచు కరుణ జూపు చుండును ఆ కారణముచే ॥దేవ॥
10. పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన -
వాస పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ -
ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే ॥దేవ॥
11. పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు =
నిరతమును గృప నిలిచి యుండును - యెహోవా నీతి -
తరముల పిల్లలకు నుండును - ఆ కారణముచే ॥దేవll
Deva sanstuti cheyave manasaa - shree - mantudagu yehovaa
Sanstuti cheyave manasaa = deva sanstuti cheyumaa naa -
Jeevamaa yehovaa devuni paavana naamamu nutinchumaa
Naa yantarangamu - lo vasinchuno samastamaa
1. jeevamaa, yehovaa neeku - jesina mellan maruvaku =
neevu chesina paatakambulanu manninchi jabbu - leviyun
lekunda jeyunu - aa kaaranamuche ॥deva॥
2. chaavu gotinundi ninnu - levanetti dayanu krupanu =
jeeva kireetamuga veyunu - nee shirasu meeda jeeva kireetamuga
veyunu - aa kaaranamuche ॥deva॥
3. yauvanambu pakshiraaju - yauvanambu valene krotta =
yauvanambai velayunatluga - me lichchi needu -
bhaavamunu santushtiparachunugaa - aakaaranamuche ॥deva॥
4. prabhuvu neeti panulu cheyun - baadhitulaku nyaaya michchun =
vibhudu maargamu telipe, mosheku - dana kaaryamulanu
vippe nishraayelu janamunaku - aa kaaranamuche ॥deva॥
5. atyadhika prema svaroopi - yaina deergha shaantaparudu -
nityamu vyaajyambu cheyadu aa kruponnatudu
nee payi nepudu kopamunchadu aa kaaranamuche ॥deva॥
6. paamarula mani pratyupakaara - prati phalambul pampaledu=
bhoomikanna naakasambunna - yettundu daiva - prema
bhakti janula yanduna - aa kaaranamuche ॥deva॥
7. padamatiki doorpenta yedamo - paapamulakunu
manaku nanta = yedamu kalugajesiyunnaadu mana paapamulanu
edamugaane chesiyunnaadu - aa kaaranamuche ॥deva॥
8. kodukulapai dandri jaali - padu vidhamugaa bhaktiparula=
yedala jaali padunu devundu - tana bhaktiparula -
yedala jaalipadunu devundu - aa kaaranamuche ॥deva॥
9. manamu nirmitamayina reeti - tanaku delisiyunna
sangati = manamu mantivaara manchunu - jnyaapakamuchesi
konuchu karuna joopu chundunu aa kaaranamuche ॥deva॥
10. poosi gaali veeva negiri - poyi basanu deliyani vana -
vaasa pushpamu valene narudundu - naru naayuvu truna -
praayamu mana deva krupa mendu - aa kaaranamuche ॥deva॥
11. parama deva nibandha naajnyal - bhaktito gaikonu janulaku =
niratamunu grupa nilichi yundunu - yehovaa neeti -
taramula pillalaku nundunu - aa kaaranamuche ॥devall
Comments
Post a Comment