దేవర నీ-దీవెనలు
దేవర నీ - దీవెనలు - ధారాళముగను వీరలపై =
బాగుగ వేగమె దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను
1. దంపతులు దండిగ నీ-ధాత్రిలో వెలయుచు సంపదలన్=
సొంపుగ నింపుగ పెంపగుచు స-హింపున వీరు సుఖించుటకై ॥దేవర॥
2. ఈ కవను నీ కరుణన్ - ఆఖరు వరకును లోకములో =
శోకము లేకయె యేకముగా బ్రాకటముగను జేకొనుము llదేవరll
3. ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమతో నొప్పుచు దా =
మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ llదేవర॥
4. తాపములు పాపములు - మోపుగ వీరిపై రాకుండగా =
గాపుగ బ్రాపుగ దాపునుండి యాపద లన్నియు బాపుచును llదేవరll
5. సాధులుగన్ జేయుటకై - శోధనలచే నీవు శోధింపగా =
కదలక వదలక ముదమున నీ - పాదము దాపున బాదుకొనన్ llదేవర॥
6. మెండుగ భూమండలపు - గండములలో వీరుండగను =
తండ్రిగ దండిగ నండనుండి మెండుగ వానిని ఖండించవే llదేవర॥
7. ఇద్దర వీరిద్దరును - శుద్ధులై నిన్ను సేవించుటకై =
శ్రద్ధతో బుద్ధిగ సిద్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ॥దేవర॥
8. వాసిగ నీ దాసులము చేసిన యీ మొఱల్ దీసికొని =
మా సకలేశ్వర నీ సుతుడౌ యేసుని పేరిట బ్రోవుమామెన్ llదేవర॥
Devara nee-deevenalu - dhaaraalamuganu veeralapai =
Baaguga vegame diganimmu - paavana yesuni dvaaraganu
1. dampatulu dandiga nee-dhaatrilo velayuchu sampadalan=
sompuga nimpuga pempaguchu sa-
himpuna veeru sukhinchutakai ॥devara॥
2. ee kavanu nee karunan - aakharu varakunu lokamulo =
shokamu lekaye yekamugaa braakatamuganu jekonumu lldevarall
3. ippagidi neppudunu - goppagu premato noppuchu daa =
moppina choppuna dappakanu
meppuga bratukaga bampu krupan lldevara॥
4. taapamulu paapamulu - mopuga veeripai raakundagaa =
gaapuga braapuga daapunundi
yaapada lanniyu baapuchunu lldevarall
5. saadhulugan jeyutakai - shodhanalache neevu shodhimpagaa =
kadalaka vadalaka mudamuna nee -
paadamu daapuna baadukonan lldevara॥
6. menduga bhoomandalapu - gandamulalo veerundaganu =
tandriga dandiga nandanundi
menduga vaanini khandinchave lldevara॥
7. iddara veeriddarunu - shuddhulai ninnu sevinchutakai =
shraddhato buddhiga siddhapadan
diddumu nee priya biddalugaan ॥devara॥
8. vaasiga nee daasulamu chesina yee moral deesikoni =
maa sakaleshvara nee sutudau yesuni perita brovumaamen lldevara॥
Comments
Post a Comment