దినదినంబు యేసుకు దగ్గరగా
దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునే
నా మదిలో కోరుతా ఎల్లప్పుడు యేసువైపు కన్నులెత్తి పాడుతా
పరమ తండ్రి నీదు మాట బలముతోడ సాగుతా
1. మారిపోయే లోకమందు - మనుజులెంతో మారిన
మారునా ప్రభుయేసు ప్రేమ - ఆశతోడ చేరనా ॥దిన॥
2. ఎన్నడు ఎడబాయడు - నను విడువడు ఏమాత్రము
ప్రభువే నాకు అభయము - భయపడను నేనేమాత్రము ॥దిన॥
3. దైవవాక్యం జీవవాక్యం - అనుదినంబు చదువుతా
ప్రభువు మాట నాదు బాట - విభునితో మాట్లాడుతా ॥దిన॥
4. పరిశుద్ధముగ అనుకూలముగా - జీవయాగమై నిలిచెదా
సిలువమోసి సేవచేయ - యేసుతోనే కదులుతా ॥దిన॥
Dinadinambu yesuku daggaragaa cherutaa anukshanambu yesune
Naa madilo korutaa ellappudu yesuvaipu kannuletti paadutaa
Parama tandri needu maata balamutoda saagutaa
1. maaripoye lokamandu - manujulento maarina
maarunaa prabhuyesu prema - aashatoda cheranaa ॥dina॥
2. ennadu edabaayadu - nanu viduvadu emaatramu
prabhuve naaku abhayamu - bhayapadanu nenemaatramu ॥dina॥
3. daivavaakyam jeevavaakyam - anudinambu chaduvutaa
prabhuvu maata naadu baata - vibhunito maatlaadutaa ॥dina॥
4. parishuddhamuga anukoolamugaa - jeevayaagamai nilichedaa
siluvamosi sevacheya - yesutone kadulutaa ॥dina॥
Comments
Post a Comment