దిక్కులేని వాడనో ప్రభో
దిక్కులేని వాడనో ప్రభో - నీ యండ జేరి
మ్రొక్కి సేవజేతు నో ప్రభో = మ్రొక్కి విన్నవించు వారి
యక్కరలను దీర్చు సత్యము - గ్రక్కున నిడి యాదరించు
మక్కువైన దేవ తనయ
1. ఘోర పాప భారము నెల్లను - మోయుచు నలయు
వారలార రండటంచును = భూరి దయను బిలిచి యున్న
సార వాక్కు లెఱుగ కధిక భార మొంది తుదిని నీ దరి
జేరితి నన్నాదరించుము ॥దిక్కులేనిll
2. బలము లేని వాడనో ప్రభో - కేవలము పాప - ములను
జేసి యలసితిని ప్రభో = ఇలను నే నొనర్చునట్టి -
కలుష జాలములను నీవు - తొలగ జేసి యాత్మ కధిక -
బలము నొసగి మనుపు మయ్య ॥దిక్కులేని॥
3. పామరుండ నౌట వల్లను నే నెఱుగనైతి - క్షేమ
మిచ్చు పదవు లెల్లను = కామ క్రోధ లోభములను -
దీమసమున విడిచి యేసు నామ మందు విశ్వసించి
ప్రేమను వర్తింపజేయు ॥దిక్కులేని॥
4. వందనం బొనర్తునో ప్రభో నా డెందమందలి - సందియము
లణంచు మో ప్రభో = సందియమెడబాపి శాస్త్ర మందు
నుండు సార వాక్యానంద పదవు లనుభవింప -
డెందము వెలిగింప వయ్య ॥దిక్కులేని॥
Dikkuleni vaadano prabho - nee yanda jeri
Mrokki sevajetu no prabho = mrokki vinnavinchu vaari
Yakkaralanu deerchu satyamu - grakkuna nidi yaadarinchu
Makkuvaina deva tanaya
1. ghora paapa bhaaramu nellanu - moyuchu nalayu
vaaralaara randatanchunu = bhoori dayanu bilichi yunna
saara vaakku leruga kadhika bhaara mondi tudini nee dari
jeriti nannaadarinchumu ॥dikkulenill
2. balamu leni vaadano prabho - kevalamu paapa - mulanu
jesi yalasitini prabho = ilanu ne nonarchunatti -
kalusha jaalamulanu neevu - tolaga jesi yaatma kadhika -
balamu nosagi manupu mayya ॥dikkuleni॥
3. paamarunda nauta vallanu ne neruganaiti - kshema
michchu padavu lellanu = kaama krodha lobhamulanu -
deemasamuna vidichi yesu naama mandu vishvasinchi
premanu vartimpajeyu ॥dikkuleni॥
4. vandanam bonartuno prabho naa dendamandali - sandiyamu
lananchu mo prabho = sandiyamedabaapi shaastra mandu
nundu saara vaakyaananda padavu lanubhavimpa -
dendamu veligimpa vayya ॥dikkuleni॥
Comments
Post a Comment