దేవా! వెంబడించితి నీ నామమున్

దేవా! వెంబడించితి నీ నామమున్ - జీవితేశ్వర నా జీవితాశ నీవే = రావె
నా భాగ్యమా యేసువా ll దేవా ll 


1. యేసూ! నీదు ప్రేమను నే వింటిని
  భాసురంబగు నీ సిలువ నే గంటిని = యేసువాడను నే నంటిని ll దేవా ll 


2. ప్రభో! ప్రారంభించితి ప్రయాణమున్
  పరలోక యెరూషలేము పురికిన్ = పావనా జూపుము మార్గము ll దేవా ll 


3. నాధా! ఈదలేను ఈ ప్రవాహమున్
  నీదరిన్ గాన నీ కెరటాలధాటిచే = నావికా రమ్ము నన్ బ్రోవుము ll దేవా ll  


4. స్వామీ! నీదు ప్రేమకు నే సాక్షిని
    సంఘమందున నా పొరుగువారికి నీ = సత్య సువార్త నే జాటుదున్ ॥దేవా॥


5. రాజా! నీదు రాజ్యములో జేరితి
  రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము = రక్షణానందము గూర్చుము ॥దేవ॥ Devaa! vembadinchiti nee naamamun - jeeviteshvara naa jeevitaasha neeve = raave Naa bhaagyamaa yesuvaa ll devaa ll 1. yesoo! needu premanu ne vintini bhaasurambagu nee siluva ne gantini = yesuvaadanu ne nantini ll devaa ll 2. prabho! praarambhinchiti prayaanamun paraloka yerooshalemu purikin = paavanaa joopumu maargamu ll devaa ll 3. naadhaa! eedalenu ee pravaahamun needarin gaana nee kerataaladhaatiche = naavikaa rammu nan brovumu ll devaa ll 4. svaamee! needu premaku ne saakshini sanghamanduna naa poruguvaariki nee = satya suvaarta ne jaatudun ॥devaa॥ 5. raajaa! needu raajyamulo jeriti ramyamau raajyamanduna nan vaadumu = rakshanaanandamu goorchumu ॥deva॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు