దేవా నీ దివ్య వాక్యము

దేవా నీ దివ్య వాక్యము ఈవిగ మాకు దొరికెను
హల్లెలూయ... హల్లెలూయ.. హల్లెలూయ.. హల్లెలూయ..


1. పాపముతో నిండిన మమ్మున్ దీపము వంటి వాక్యమే
    కల్వరికి నడిపించి కలుషంబులు తొలగించి- మా హృదయము వెలిగించెను (2)


2. వానవంటి వాక్యము తేనెకంటే మధురము
  వెండి బంగారముల వెల ఎంతయైనను -  తులతూగవు నీ వాక్యముతో (2)


3. నీ వాక్యము నీరై యుండన్ మా దాహము
    తీర్చుచుండెన్ ఆ నీరే మాకు పానము స్నానము
    నీ వాక్యము మా కీయుము (2)


4. నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది
    నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి
    నీ బలమును మాకీయుమా (2)


5. సుత్తియై మెత్తనచేయున్ - విత్తనమై ఫలియించును
    ఖడ్గమువలె దూయుచు కలుషములను కోయుచు
    నీ మహిమను మా కీయుమా (2)


6. అద్దమువలె దిద్దును మమ్మున్ అగ్నియై కాల్చును చెత్తన్
  నీ వాక్యము వివరించి - మాలోటును సవరించి - 
  నీ రూపము మాకీయుము (2)


7. వాక్యముతో నింపితివి సాక్షులుగా పంపితివి
    నీ చేతిలో మముదాచి నీ చూపులో మము కాచి -
    నీ సన్నిధి మా కీయుము (2) Devaa nee divya vaakyamu eeviga maaku dorikenu Hallelooya... hallelooya.. hallelooya.. hallelooya.. 1. paapamuto nindina mammun deepamu vanti vaakyame kalvariki nadipinchi kalushambulu tolaginchi- maa hrudayamu veliginchenu (2) 2. vaanavanti vaakyamu tenekante madhuramu vendi bangaaramula vela entayainanu - tulatoogavu nee vaakyamuto (2) 3. nee vaakyamu neerai yundan maa daahamu teerchuchunden aa neere maaku paanamu snaanamu nee vaakyamu maa keeyumu (2) 4. nirmala ksheeramu vantidi nityaahaaramu vantidi nee paalato mamu penchi nee totalo mamu unchi nee balamunu maakeeyumaa (2) 5. suttiyai mettanacheyun - vittanamai phaliyinchunu khadgamuvale dooyuchu kalushamulanu koyuchu nee mahimanu maa keeyumaa (2) 6. addamuvale diddunu mammun agniyai kaalchunu chettan nee vaakyamu vivarinchi - maalotunu savarinchi - nee roopamu maakeeyumu (2) 7. vaakyamuto nimpitivi saakshulugaa pampitivi nee chetilo mamudaachi nee choopulo mamu kaachi - nee sannidhi maa keeyumu (2)

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు