అడవి వృక్షములలో

అడవి వృక్షములలో - జల్దారు వృక్షమెట్లున్నదో
పరిశుద్ధుల మధ్యలో - అతి శ్రేష్టుడైన ప్రభుని

 పాడెదన్ నాదు ప్రియుని - జీవకాలమెల్ల 

అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో సాగెదను


1. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను 

    నీ కృపతో నన్ను నడిపి- నూతన జీవమిచ్చితివి


2. నా కష్ట తరంగములలో - దుఃఖ సాగరమందుండగా 

    నీ కుడి హస్తము చాపి - భయపడకని పలికితివి


3. ఆనంద భరితనై - నేను నీ ప్రేమలో నుండుటకు 

    నీ స్వరము నాకతి మధురం నీ ముఖము మనోహరము


4. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదన్
  నా పరుగును తుదముట్టించి  -  నీ సన్నిధిలో నుండెదన్

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో