స్తుతియు మహిమ ఘనత నీకే
స్తుతియు మహిమ ఘనత నీకే - యుగయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా (2) ||స్తుతియు||
1.మా దేవుడవై మాకిచ్చితివి -ఎంతో గొప్ప శుభ దినము (2)
మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)
కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు||
2.నీవొక్కడవే గొప్ప దేవుడవు -ఘనకార్యములు చేయుదువు (2)
నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2)
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2) ||స్తుతియు||
3.నీవే మాకు పరమ ప్రభుడవై - నీ చిత్తము నెరవేర్చితివి (2)
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2)
నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2) ||స్తుతియు||
4.భరియించితివి శ్రమలు నిందలు - ఓర్చితివన్ని మా కొరకు (2)
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2)
పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2) ||స్తుతియు||
Stutiyu mahima ghanata neeke - yugayugamula varaku
Ento nammadagina devaa (2) ||stutiyu||
1.maa devudavai maakichchitivi -ento goppa shubha dinamu (2)
Memandaramu utsaahinchi santoshinchedamu (2)
Koniyaadedamu maruvabadani melula chesenani (2) ||stutiyu||
2.neevokkadave goppa devudavu -ghanakaaryamulu cheyuduvu (2)
Needu krupaye nirantaramu nilachiyundunugaa (2)
Ninnu memu aanandamuto aaraadhinchedamu (2) ||stutiyu||
3.neeve maaku parama prabhudavai - nee chittamu neraverchitivi (2)
Jeevamunichchi nadipinchitivi nee aatma dvaaraa (2)
Nadipinchedavu sama bhoomigala pradeshamulo nannu (2) ||stutiyu||
4.bhariyinchitivi shramalu nindalu - orchitivanni maa koraku (2)
Maranamu gelchi odinchitivi saataanu balamun (2)
Paramu nundi maakai vachche prabhu yesu jayamu (2) ||stutiyu||
Comments
Post a Comment